Top
Batukamma

పాపం కేసీఆర్, కవిత.. ఏరి కోరి ముహూర్తం పెడితే...!

పాపం కేసీఆర్, కవిత.. ఏరి కోరి ముహూర్తం పెడితే...!
X
Highlights

తానొకటి తలిస్తే.. దైవమొకటి తలిచిందన్న.. సామెత అందరికి తెలిసే ఉంటుంది.


తానొకటి తలిస్తే.. దైవమొకటి తలిచిందన్న.. సామెత అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇది నూటికి నూరు శాతం నిజమైంది. తానొకటి తలిచి.. పర్ ఫెక్ట్ ప్లానింగ్ చేస్తే.. ఇప్పుడు అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది.

కేసీఆర్ కూతురు కవిత.. నిజామాబాద్ ఎమ్మెల్సీగా గెలిచారు. గెలిచాక ప్రమాణస్వీకారం చేయాలి కదా. దీనికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేశారు. అంటే.. చట్టాల సవరణ పేరు చెప్పి.. మంగళ, బుధవారాల్లో అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశం కూడా జరిగింది.

రేపు మండలి సమావేశం జరగాలి. అనుకున్నది.. అనుకున్నట్టు జరిగితే.. రేపు మండలిలో కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. కానీ కేసీఆర్ తలచినదే జరగాలని రూల్ ఏమీ లేదు కదా. దేవుడు మరొకటి తలిచాడు. కవిత ప్రమాణస్వీకారానికి ఏరి కోరి పెట్టిన ముహూర్తం కాస్తా.. ఫెయిల్ అయ్యింది. ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.

దీనికి కారణం ఏంటంటే.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. నిన్న కవితను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో కరోనా టెస్ట్ చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకేముంది.. అయిపాయే.. కవితక్క పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి.

సంజయ్ కి కరోనా రావడంతో.. కవిత ప్రస్తుతం క్వారంటైన్ అయ్యారు. మరికొన్ని రోజుల పాటు బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. సో.. ఇప్పట్లో కవితక్క ప్రమాణస్వీకారం లేనట్టే.

నిజానికి సోమవారం, మంగళవారం జరగాల్సిన సమావేశాలను కవిత ప్రమాణస్వీకారం కోసమే మంగళ, బుధ వారాలకు మార్చారని విమర్శలు వచ్చాయి. ఎన్ని మార్పులు చేసినా.. ఆఖరికి ఇలా కరోనా దెబ్బతో కవితక్క ప్రమాణస్వీకారం కాస్త వాయిదా పడినట్టు తెలుస్తోంది.

Next Story
Share it