Top
Batukamma

కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం

కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం
X
Highlights

కుటుంబంతో సహా స్వయంగా వెళ్లి అమ్మాయిని పరామర్శించి.. తన సొంత కూతురిలా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూషకు పెళ్లి కుదిరింది. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నిశ్చితార్థం కూడా జరిగిది. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ వేడుకను దగ్గరుండి మరీ జరిపించారు.

ఐదేళ్ల క్రితం పినతల్లి వేధింపులతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడింది ప్రత్యూష. చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సాయంతో ప్రాణాలతో బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. కుటుంబంతో సహా స్వయంగా వెళ్లి అమ్మాయిని పరామర్శించి.. తన సొంత కూతురిలా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

అప్పటి నుంచి ఆమె ముఖ్యమంత్రి సంరక్షణలోనే పెరుగుతున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఆమె బాగోగులు చూస్తున్నారు. కష్టాల నుంచి బయటపడిన ప్రత్యూష నర్సింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తోంది.

ప్రత్యూష గురించి తెలిసిన రాంనగర్ కు చెందిన చరణ్ రెడ్డి.. ఆమెను కలిసి పెళ్లి చేసుకుంటానని కోరాడు. ఆమెకు నచ్చడంతో ఓకే చెప్పేసింది. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లింది ప్రత్యూష. ప్రగతిభవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో మాట్లాడింది. ఆయన కూడా ఓకే చెప్పడంతో వీరి నిశ్చితార్థం జరిగింది

హైదరాబాద్ విద్యానాగర్ లోని ఓ హోటల్ లో ఇద్దరి నిశ్చితార్థం నిరాడంబరంగా నిర్వహించారు. పెళ్లికి తప్పకుండా వస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Next Story
Share it