Top
Batukamma

మంత్రి మల్లారెడ్డి పోస్ట్ ఊస్ట్... కనికరించని కేసీఆర్.. త్వరలోనే కొత్త మహిళా మంత్రి..!

మంత్రి మల్లారెడ్డి పోస్ట్ ఊస్ట్... కనికరించని కేసీఆర్.. త్వరలోనే కొత్త మహిళా మంత్రి..!
X
Highlights

ఇటీవల సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆడియో లీక్ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే..

ఇటీవల సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆడియో లీక్ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఫోన్లో సదరు మంత్రిగారు బెదిరించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. 'సర్పంచ్ కిస్తే సరిపోతదా.. ఈడ ఎమ్మెల్యే, మంత్రి ఉన్నడు.. పొట్టుపొట్టు చేసి ఇడ్సిపెడ్తం' అంటూ మల్లారెడ్డి బెదిరిస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది.

దీనిపైన స్పందించిన మంత్రి.. ఆ ఆడియో నాది కాదని, తాను ఏ రియల్టర్‌తోనూ మాట్లాడలేదని వివరణ ఇచ్చుకున్నారు. ఇంతటితో ఈ వివాదం ముగియలేదు. రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపింది ఈ మ్యాటర్.. ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వాన్ని దుమ్ముదులుపుతున్నాయి. అయితే ఇష్యూ బాగా పెద్దది కావడంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.

దీనిపైన సీఎంని కలిసి సంజాయిషీ ఇచ్చుకునేందుకు మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని సమాచారం. మంగళవారం మధ్యాహ్నం సిద్దిపేట పర్యటన ముగించుకొని కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెళ్లారు అక్కడి నుంచి బుధవారం ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఈ రెండు చోట్లల్లో సీఎంని కలిసేందుకు మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారట..

కానీ సీఎం మాత్రం అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే మంత్రివర్గం నుంచి మల్లారెడ్డిని పక్కన పెట్టాలని సీఎం అలోచిస్తున్నరాట.. ఆ స్థానంలో తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన పీవీ కూతురు సురభివాణికి ఆ మంత్రి పదవిని ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. దీనిపైన త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.

Next Story
Share it