Top
Batukamma

జీ హుజూర్... ఇక చాలు.. వదిలేద్దాం..!

జీ హుజూర్... ఇక చాలు.. వదిలేద్దాం..!
X
Highlights

రాజకీయ నాయకుడు తన అస్థిత్వాన్ని, ఆస్తిని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడు. తన వెంట ఉన్నవారిని దిగజారుస్తాడు.

KCR FUTURE IN TELANGANA POLITICS: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా.. ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్నటి మొన్నటి వరకు తనకు తిరుగులేదనుకున్న కేసీఆర్(KCR).. ఇప్పుడు తలవంచక తప్పని పరిస్థితి వచ్చింది. వాడెవడు.. వీడెవడని మాట్లాడిన అదే వ్యక్తి.. ఇప్పుడు ఢిల్లీ పెద్దల ముందు సాష్టాంగపడుతున్నారు.

తానే ఓ రైతు(FARMER)ను.. రైతుల పక్షపాతిని.. తాను ఏం చేసినా రైతుల కోసమే లక్షల మాటలు చెప్పిన కేసీఆర్... ఇప్పుడు కంప్లీట్ గా యూ టర్న్ తీసుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయచట్టాలు(new agriculture laws) వద్దే వద్దని ఢిల్లీలో లొల్లి జరుగుతుండగానే.. రైతులకు మద్దతిస్తున్నానని చెప్పిన అదే నోటితోని.. కొత్త వ్యవసాయచట్టాలకు స్వాగతం చెప్పారు.

రాష్ట్రంలో వచ్చే సీజన్ నుంచి పంటకొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని ప్రకటన చేశారు. కొత్త చట్టాలతో రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉందని.. రైతులు అలాగే అమ్ముకోవాలని తేల్చిచెప్పారు. పండించిన పంట మొత్తం కొనడానికి సర్కారు... మిల్లరో.. వ్యాపార సంస్థో కాదని కొత్త మాటలు మాట్లాడారు. నియంత్రిత సాగు విషయంలోనూ పూర్తిగా వెనక్కి తగ్గారు. నియంత్రిత సాగే ముద్దు అని గతంలో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అది వద్దే వద్దని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అసలు.. కేసీఆర్ ఎందుకు సడెన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు..?

జస్ట్ కొద్ది రోజుల క్రితం అవే వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ.. స్వయంగా కేసీఆర్ కొడుకు కేటీఆర్(ktr), కూతురు కవిత(kavitha), అల్లుడు హరీశ్ రావు(harishrao) రోడ్లపై బైటాయించారు కదా.

- Raashi phalalu : 28-12-2020 సోమవారం నేటి రాశిఫలాలు

- సీఎం జగన్ కు చుక్కలు చూపించబోతున్న బండి సంజయ్!

- చంద్రబాబు NTRకి చేసింది వెన్నుపోటా!!

- నిండుగా బట్టలేసుకున్న అనసూయ.. హార్ట్ అయిన ఫ్యాన్స్!

మరి ఇఫ్పుడెందుకు కేసీఆర్(kcr) ఇలా చట్టాల విషయంలో రూటు మార్చారు...?

ఇప్పుడు ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్బంలోనే మరికొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి.

వాస్తవానికి కేసీఆర్ గతంలో ఉన్నంత ఫ్రీజోన్ లో ఇప్పుడు లేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(bjp) నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. తెలంగాణ(telangana) ఏర్పాటుకు ముందున్న కేసీఆర్ ఇప్పుడు లేడు. ఆస్తులు పెరిగాయి. ఆస్తులు పెంచుకునేందుకు సహకరించే మిత్రులు పెరిగారు. వందమంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో ఉన్నారు. ఇక.. తనకు ఎదురేముంది అనుకున్నారు కేసీఆర్.

కానీ రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టిన మోడీ(modi) అండ్ అమిత్ షా(qmitshah) టీం.. కేసీఆర్ ఆర్థికమూలాలపై గురి పెట్టింది. అప్పట్లో మెఘా(meil) ఇంజినీరింగ్ కంపెనీ ఓనర్ల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇటీవల యశోధ హాస్పిటల్స్ (yashoda hospitals)లో ఐటీ సోదాలు జరిగాయి. అదయ్యాక.. రాష్ట్రంలో ప్రధాన ఫైనాన్షియర్ గా ప్రచారంలో ఉన్న మంత్రి మల్లారెడ్డి(mallareddy) కాలేజీకి న్యాక్ షాక్ ఇచ్చింది.

ఇలా వరుస సంఘటనలు కేసీఆర్ బెంబేలెత్తించాయనే చెప్పాలి. ఇవే కాదు.. కేసీఆర్ కు ఆర్థిక వనరులుగా చాలా సంస్థల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అందులో చాలా వరకు తన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలవే ఉన్నాయి.

తాను అదే దూకుడుతో వెళితే.. నెక్ట్స్ వాటిని టార్గెట్ చేసే అవకాశముంది. చివరగా కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు తన దగ్గరకు వచ్చే ప్రమాదమూ లేకపోలేదని కేసీఆర్ ముందే పసిగట్టినట్టు తెలుస్తోంది.


ఎందుకంటే గత ఆరున్నరేళ్లలో కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు బీభత్సంగా పెరిగిపోయాయి. గత ఎన్నికల టైంలో కేటీఆర్ ఇచ్చిన అఫిడవిట్ లోనే ఆస్తులు 400 శాతం పెరిగాయి. అంటే అనధికారికంగా ఇంకా ఎంత పెరిగి ఉంటాయనేది మనం ఊహించుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ ఎందుకు.? ఎలాగూ తాను సీఎంగా రెండో టర్మ్ పూర్తి చేసుకుంటాను. తన తర్వాత కుమారుడు కేటీఆర్, కూతురు కవిత భవిష్యత్ బాగుండాలి. కోర్టులు.. కేసులు.. జైళ్లంటూ తిరిగే పరిస్థితి రావొద్దు. ఒక్కసారి కేసుల్లో ఇరుక్కుంటే అది ఉన్న ఆస్తులన్నింటిని ఊడ్చిపెడుతుంది. సంపాదించుకున్న మంచి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎలాగూ పదేళ్లు పాలించాం. ఇక మనకెందుకు.. కేంద్రానికి వ్యతిరేకంగా పోయి సాధించేదేమున్నది.. వాళ్లు చెప్పిందానికి తలూపేస్తే సరి.. వాళ్లు సంతోషంగా ఉంటారు.. మనం కూడా ఖుషీగా ఉండొచ్చు.. ఇది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ.. రైతులు, రైతుల సంక్షేమం, రైతుల పక్షపాతి అని కేసీఆర్(kcr) ఇన్ని రోజులు చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలేనా..? రాష్ట్రం కంటే కుటుంబమే ముఖ్యమా..? అనే ప్రశ్నలు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.

ఎన్ని ప్రశ్నలు వచ్చినా.. ఉన్న సమాధానం మాత్రం ఒక్కటే.

రాజకీయ నాయకుడు తన అస్థిత్వాన్ని, ఆస్తిని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడు. తన వెంట ఉన్నవారిని దిగజారుస్తాడు.

- అల్టిమేట్ ఫిగర్ ను సెట్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ .. ఈ హాట్ బ్యూటి ఎవరంటే..?

- LIE IS BELIEF: అబద్దమే నమ్మకం..!

Next Story
Share it