Top
Batukamma

అపుడు పసుపు.. ఇపుడు మొక్కజొన్న రైతులు.. కేసీఆర్ కు మళ్లీ దెబ్బ తప్పదా..?

అపుడు పసుపు.. ఇపుడు మొక్కజొన్న రైతులు.. కేసీఆర్ కు మళ్లీ దెబ్బ తప్పదా..?
X
Highlights

కవిత ఓడిపోవడంతో టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత మొదలైంది అన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగింది.

రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దేదించాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. అయితే గత ఏడాది జరిగిన లోక్ సభ ఎలక్షన్ లలో క్లీన్ స్వీప్ చేయాలనీ అనుకున్న టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ నాలుగు ఎంపీ స్థానలను గెలుచుకొని ఉహించని షాక్ ఇచ్చింది. అదే పెద్ద షాక్ అంటే సీఎం కూతురు కవిత ఓడిపోవడం ఆ పార్టీకి కోలుకొని దెబ్బ తీసింది.

కవిత ఓడిపోవడంతో టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత మొదలైంది అన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగింది. దానికి తోడు ఇప్పుడు రైతుల నుంచి వ్యతిరేకత మొదలైంది. మెట్‌ప‌ల్లిలోని రైతులు తాజాగా భారీ ధర్నా నిర్వహించారు. పండించిన మొక్కజొన్న పంటను కొనేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దినిపట్ల నిరసిన వ్యక్తం చేస్తూ.. ఆందోళనకు కూడా దిగారు.

ఈ నిరసనలో దాదాపుగా మూడు వేల మందికి పైగా రైతులు పాల్గొన్నారు. మూడువేలకి పైగా అంటే మామలు విషయం కాదు మరి.. అంతేకాకుండా అయితే నిరసనకి దిగిన రైతులు కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఇంటిపైన దాడి చేశారు. అధికార పార్టీ ఇంటిపైనే రాళ్ళూ వేసే దాకా వేల్లదంటే సమస్య ఎంత సీరియస్ గా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

ఇక నిజామాబాదులో కవిత ఓటమికి పసుపు రైతులే కారణం అన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మొక్కజొన్న రైతులు నిరసనతో పార్టీ పైన మరింత వ్యతిరేకత మొదలైంది. వచ్చే ఏడాది అక్కడ టీఆర్ఎస్ కి ప్రజలు చెక్ పెట్టనున్నారన్న ప్రచారం నడుస్తోంది.

Next Story
Share it