Top
Batukamma

కరోనా నుంచి కోలుకున్నా.. నాయిని ఎందుకు క్రిటికల్ కండీషన్లో ఉన్నారు..?

కరోనా నుంచి కోలుకున్నా.. నాయిని ఎందుకు క్రిటికల్ కండీషన్లో ఉన్నారు..?
X
Highlights

రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది

రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. కరోనా నుంచి కోలుకున్నా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆయన పరిస్థితి విషమించినట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.

గత నెల 28న నాయిని నరసింహారెడ్డి కరోనా భారిన పడ్డారు. దీంతో ఆయనను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. దాదాపు అక్కడ 16 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నారు.

కానీ డిశ్చార్జ్ చేద్దామనుకునే సమయంలో ఆయనకు లంగ్స్ ఇన్ఫెక్షన్ సోకింది. అది తీవ్రస్థాయి న్యుమోనియాకు దారి తీసింది. దీంతో ఆయనను అపోలో హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. అప్పటికే ఆయన శరీరంలో ఆక్సీజన్ లెవల్స్ పడిపోయాయని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఊపిరితీసుకోవడం కష్టంగా ఉందని.. వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ చేస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు.

నాయిని ఒక్కరే కాదు.. ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. అలాగే నాయిని అల్లుడు, నాయిని పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకింది. వారు కరోనా నుంచి కోలుకున్నారు. కానీ వయసు పై బడిన వ్యక్తి కావడంతో నాయిని నరసింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది.

Next Story
Share it