Top
Batukamma

కూకట్‌పల్లి అత్యాచారం కేసులో మరో ట్విస్ట్... మూడు నెలల నుంచే నయా ప్లాన్!

కూకట్‌పల్లి అత్యాచారం కేసులో మరో ట్విస్ట్... మూడు నెలల నుంచే నయా ప్లాన్!
X

Kukatpally gang rape case

Highlights

కేసు విచారణలో భాగంగా ఈ ముగ్గురు నిందితులు మూడు నెలలుగా భాదితురాలు పై అత్యాచారం చేసేందుకు పన్నాగం పన్నినట్లు తేలింది. ఈ నేపధ్యంలో జోసెఫ్‌ పుట్టినరోజు కావడం, దానికి భాదితురాలుని ఆహ్వానిచడం, ఆ తర్వాత ఆ ప్లాన్ ని అమలు చేయడం జరిగింది.

హైదరాబాదు నగరంలో డిగ్రీ చదువుతున్న అమ్మాయి(19) పైన ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ కేసుకు సంబంధించిన నిందితులు జోసెఫ్‌(20), బొందగడ్ల నవీన్‌రెడ్డి(22), రాగని రాము(23) లను పోలీసులు అరెస్ట్ చేశారు.

కేసు విచారణలో భాగంగా ఈ ముగ్గురు నిందితులు మూడు నెలలుగా భాదితురాలు పై అత్యాచారం చేసేందుకు పన్నాగం పన్నినట్లు తేలింది. ఈ నేపధ్యంలో జోసెఫ్‌ పుట్టినరోజు కావడం, దానికి భాదితురాలుని ఆహ్వానిచడం, ఆ తర్వాత ఆ ప్లాన్ ని అమలు చేయడం జరిగింది.

అయితే అత్యాచారం చేసిన సమయంలో ఫోటోలు వీడియోలు ఏమైనా తీసి ఉంటారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను కస్టోడియన్‌లోకి తీసుకున్నాక మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

ఇంతకి ఎం జరిగింది ?

జూబ్లీహిల్స్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఓ యువతి(19) హైదరాబాదులోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే జోసెఫ్‌, నవీన్‌రెడ్డి, రాములుతో ఆమెకి పరిచయం ఏర్పడింది. అయితే ఈ నెల5 న సదరు యువతి కాలేజీలో ఫీజు కట్టేందుకు వెళ్ళింది.

ఈ క్రమంలో జోసెఫ్‌ యువతికి ఫోన్‌ చేసి ఆ రోజు తన పుట్టినరోజని, నవీన్‌, రాములుతో కలిసి పార్టీ చేసుకోవాలని అనుకుంటున్నానని దానికి నువ్వు తప్పకుండా రావాలని కోరాడు. ఫ్రెండ్స్ కదా అని గుడ్డిగా నమ్మేసి ఒకే అని చెప్పేసింది. కాలేజీలో ఫీజు కట్టి కాలేజీ నుంచే జోసెఫ్‌, నవీన్‌రెడ్డి, రాములుతో కలిసి వెళ్ళింది.

ఆ తర్వాత ఆమెను లాడ్జీలోకి తీసుకువెళ్ళి అక్కడ కేకు తీసుకున్నారు. ముందు ప్లాన్ ప్రకారం దానిపైన మత్తుమందు చల్లారు. ఆ కేకును కట్ చేసి అందరం కలిసి తిందామని యువతి చెపితే దానికి ముందు నువ్వే తినాలంటూ జోసెఫ్‌ ఆమెకు తినిపించాడు. దీనితో ఆమె మత్తులోకి జారుకున్నక ముగ్గురు కలిసి ఆమె పైన అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి ఆమెను ఆటోలో ఇంటికి పంపించేశారు.

అయితే కొన్ని రోజులకి యువతి ఆరోగ్యం బాలేకపోవడంతో ఈనెల 11న ఆమెను ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. దీనితో అసలు విషయం అక్కడ బయట పడింది. దీనితో యువతి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటకు వచ్చింది.

Next Story
Share it