నిజమైన ప్రేమ ఎంతపనిచేసిందంటే..!

అమ్మా.. నన్ను క్షమించండి. నేను సంతోషంగా ఉండాలని పెళ్లి చేశావు. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు
నచ్చిన వాడితో కాకుండా మరో యువకుడితో పెళ్లి చేశారనే ఆవేదనతో ఓ నవవధువు అత్తవారింట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన రవళితో వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన రాజుకు 16 రోజుల క్రితం పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది రవళి.
ఆత్మహత్యకు ముందు ఓ సూసైడ్ లెటర్ రాసిన రవళి.. అందులో "అమ్మా.. నన్ను క్షమించండి. నేను సంతోషంగా ఉండాలని పెళ్లి చేశావు. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా మనసులో ఎవరున్నారో మీకు తెలుసు. నేను నా భర్తతో ఉండలేకపోతున్నా. ఎందుకంటే ఆయనపై నాకు ఇష్టం లేదు. దీంతో ప్రతీ క్షణం నరకం అనుభవిస్తున్నా. భర్తకు క్షమాపణ చెబుతున్నా" అంటూ అత్తవారింట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
పెళ్లిన 15 రోజులకే తమ కూతురు చనిపోవడంతో రవళి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Bank Holidays : 2021 లో బ్యాంక్ హాలీడేస్ ఇవే
- కొత్త వ్యవసాయచట్టాలతో రైతులకంటే ఎక్కువ నష్టపోయేది మనమే..! ఎలాగంటే..