Top
Batukamma

ఆపరేషన్ 139 :డాలర్ భాయ్ దొరికేశాడు

ఆపరేషన్ 139 :డాలర్ భాయ్ దొరికేశాడు
X
Highlights

డాలర్ భాయ్ ఒక్కడే తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆపరేషన్ 139 లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడు డాలర్ భాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రం నుంచి పారిపోయి గోవాలో షెల్టర్ తీసుకున్న డాలర్ భాయ్ అలియాస్ రాజశ్రీకర్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కొద్ది రోజుల క్రితం బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాలర్ భాయ్ ఒక్కడే తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో అతనిపై 376, 184, 185, 509, 67ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కొద్దిరోజుల క్రితం ఈ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసిన వారిలో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడితో పాటు చాలామంది సినీ స్టార్ల పేర్లు చెప్పింది బాధితురాలు.

అలాగే మాజీ ఎంపీ కవిత పీఏ కూడా తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. న్యూడ్ గా కాల్ మాట్లాడాలని చాలామంది తనపై ఒత్తిడి తీసుకొచ్చారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. చాలామంది రాజకీయ నాయకులు ఉన్నట్టు కూడా తెలిపింది. దీంతో అప్పట్లో ఇది సంచలనంగా మారింది.

అయితే.. కొద్ది రోజుల్లోనే తన స్టేట్మెంట్ ను మార్చేసింది యువతి. సినీ రాజకీయ నాయకులెవరూ తనపై లైంగిక దాడి చేయలేదని చెప్పింది. డాలర్ భాయ్ బెదిరింపులతోనే అలా చేసినట్టు తెలిపింది. దీంతో ఎఫ్ఐఆర్ మార్చి.. డాలర్ భాయ్ వేట ప్రారంభించారు. ఎట్టకేలకు డాలర్ భాయ్ పోలీసులకు చిక్కాడు.

Next Story
Share it