Home > News > Telangana > తప్పతాగి దొరికి మళ్ళీ నీతులు... పోలీసుల అదుపులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్!
తప్పతాగి దొరికి మళ్ళీ నీతులు... పోలీసుల అదుపులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్!

X
Highlights
మద్యం మత్తులో కారు నడిపిన యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్... మూడు వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు.
Batukamma27 Feb 2021 3:30 PM GMT
మద్యం మత్తులో కారు నడిపిన యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్... మూడు వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. జూబ్లీహిల్స్‌లోని హుడా హైట్స్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. షణ్ముఖ్‌ను అదుపులో తీసుకున్నారు. బ్రీత్ అనలైజర్‌తో పరీక్షిస్తే 170 పాయింట్లు రీడింగ్ వచ్చింది.
దీనితో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ ఘటనపైన షణ్ముఖ్ మాట్లాడుతూ.. తానూ కావాలని ఇలా చేయలేదని, నా ప్రమాదం వల్ల ఎవ్వరూ కూడా ఆసుపత్రిలో చేరలేదని అన్నాడు. దీనిని ఎందుకింత సీన్ క్రియేట్ చేస్తున్నారని.. దయచేసి వీడియోలు తీయోద్దని తెలిపాడు. అంతేకాకుండా తాను చేసింది తప్పనుకుంటే పోలీసులకి ఫిర్యాదు చేయాలనీ, ఫోన్ లో వీడియోలు తీయోద్దని అన్నాడు.
Next Story