Top
Batukamma

తెలంగాణలో వానలు ఎన్ని రోజులు..? ఎక్కడెక్కడ పడతాయి..?

తెలంగాణలో వానలు ఎన్ని రోజులు..? ఎక్కడెక్కడ పడతాయి..?
X
Highlights

ఈ వర్షాలు ఎన్ని రోజులు పడతాయి..? ఎంత తీవ్రతతో కురుస్తాయి..? అంతా టెన్షన్ పడుతున్నారు.

రాష్ట్రంలో ఆదివారం నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది. అప్పుడప్పుడు కాసేపు గ్యాప్ ఇచ్చినా.. ఆ తర్వాత కుమ్మి పడేస్తోంది. కుండపోత, కుంభవృష్టి ఎన్నిక పదాలు వాడినా ఈ వర్షానికి తక్కువే. ఆ స్థాయిలో బీభత్సం సృష్టిస్తోంది.

ఇప్పటికే భారీ వర్షాలతో పల్లెపట్నం తేడా లేకుండా ఇబ్బందుల్లో మునిగిపోయాయి. హైదరాబాద్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిటీ మొత్తం నీటిలో మునిగి తేలుతోంది. చెరువులు తెగిపోయాయి. వీధులు కాలువల్లా మారాయి. ఎటూ చూసినా నీరు తప్ప ఏమీ కనబడని పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

అయితే.. ఈ వర్షాలు ఎన్ని రోజులు పడతాయి..? ఎంత తీవ్రతతో కురుస్తాయి..? ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తాయని.. పల్లెల్లోని రైతుల నుంచి పట్నంలోని జనం వరకు అంతా టెన్షన్ పడుతున్నారు.

రాష్ట్రంలో వర్షాలు మరో రెండో రోజులు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే.. మంగళవారం కురిసినంత తీవ్రత మాత్రం ఉండబోదని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే.. తెలంగాణలోని అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

రేపు ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచాన వేసింది. అన్ని జిల్లాల్లో 2.5 నుంచి 15.6 సెంటీమీటర్ల వరకు వర్షాపాతం రికార్డయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది.




అలాగే.. ఎల్లుండి కూడా రాష్ట్రంలో వర్షం పడనుంది. అయితే.. ఎల్లుండి ఉదయం వరకు దక్షిణ తెలంగాణపై వర్షం ప్రభావం చాల వరకు తగ్గనుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రమే వర్షం పడే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఎల్లుండి 2.5 నుంచి 15.6 వరకు వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది.

అయితే ఇవాళ కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. కాబట్టి.. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే బెటర్. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో నాళాలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తోంది. అందుకే రెండు మూడు రోజుల వరకు అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటమే బెటర్.

..

ట్రెండింగ్ వీడియో :



Next Story
Share it