Top
Batukamma

CM KCR పీఆర్వో విజయ్ రాజీనామా వెనక అసలు కథ ఇదేనట..!

CM KCR పీఆర్వో విజయ్ రాజీనామా వెనక అసలు కథ ఇదేనట..!
X
Highlights

ఆ పుస్తకమే ఆయనను కేసీఆర్ కు మరింత దగ్గర చేసిందని చెబుతుంటారు. అందుకే సీఎం అయ్యాక పీఆర్వో పోస్ట్ ఇచ్చారని టాక్.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్వోగా ఉన్న గటిక విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు మీడియా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సీఎం పీఆర్వోగా ఉన్న తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో విజయ్ కుమార్ వెల్లడించారు.

అయితే.. ఆయన రాజీనామా వెనక చాలా కారణాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అవినీతి పెచ్చుమీరిపోవడంతోనే విజయ్ కుమార్ ను తప్పించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఓ నోట్ విడుదలైనట్టు చెబుతున్నారు.

గటిక విజయ్ కుమార్ గతంలో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆంధ్రజ్యోతి, టీ న్యూస్ లో వరంగల్ జిల్లా రిపోర్టర్ గా పనిచేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనేవారు.

ఆ సమయంలోనే కేసీఆర్ కు దగ్గరయ్యారు. ఉద్యమంలో కేసీఆర్ పాత్ర గురించి ఆయన ఓ పుస్తకం కూడా రాశారు. జ్వలిత దీక్ష పేరుతో ఆయన రాసిన పుస్తకం స్వయంగా కేసీఆర్ తన చేతులతో ఆవిష్కరించారు.


ఆ పుస్తకమే ఆయనను కేసీఆర్ కు మరింత దగ్గర చేసిందని చెబుతుంటారు. అందుకే సీఎం అయ్యాక.. విజయ్ కుమార్ కు పీఆర్వో పోస్ట్ ఇచ్చారని టాక్.

సాక్షాత్తు ముఖ్యమంత్రి పీఆర్వో. దీనికి తోడు విద్యుత్ శాఖలో మరో కీలక పోస్ట్ కూడా ఇచ్చారు. ఒక్క పుస్తకంతో విజయ్ కుమార్ చాలా ఉన్నతశిఖరాలకు వెళ్లిపోయాడని జర్నలిజం వర్గాల్లో టాక్ నడిచింది.

అయితే.. ఉన్నతస్థాయి పదవిని ఆయన అతిగా వినియోగించారని ఆరోపణలున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ప్రచారం కూడా ఉంది. సొంత జిల్లా వ్యక్తులు ఏదైనా పనికోసం ఫోన్ చేసినా.. దాని వ్యవహారం మరోలా ఉంటుందని టాక్.


దీనికి తోడు కేసీఆర్ కు కోపం వచ్చే పనులు చాలా చేశారట. ఎల్లప్పుడూ కేసీఆర్ కు వెంటే ఉండే ఆయనకు పార్టీకి సంబంధించిన చాలా కీలక విషయాలు తెలుస్తుంటాయి. అయితే ఈ విషయాలను ఆయన బయటకు లీక్ చేశారని కేసీఆర్ కోపంతో ఉన్నారట.

పార్టీ, ప్రభుత్వ అంశాలు సీక్రెట్ గా ఉంచాల్సిన వ్యక్తి.. స్వయంగా బయటకు లీక్ లు ఇస్తుండటం సీఎం దృష్టికి వచ్చిందట. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం. దీనికి సంబంధించిన నిన్న ప్రగతి భవన్ లో పెద్ద రచ్చే నడిచినట్టు తెలుస్తోంది. దీంతో ఇవాళ ఉదయమే తానురాజీనామా చేస్తున్నట్టు విజయ్ కుమార్ ప్రకటించారని సమాచారం.

విజయ్ కుమార్ రాజీనామా చేసిన కాసేటికే సీఎం కార్యాలయం నుంచి ఓ నోట్ రిలీజ్ అయినట్టు తెలుస్తోంది.

Next Story
Share it