Top
Batukamma

TRS- కిషన్ రెడ్డి చీకటి దోస్తీ...! చిట్టా విప్పిన రేవంత్ రెడ్డి.

TRS- కిషన్ రెడ్డి చీకటి దోస్తీ...! చిట్టా విప్పిన రేవంత్ రెడ్డి.
X
Highlights

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ తో కిషన్ రెడ్డికి చీకటి ఒప్పందం ఉందన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్, కిషన్ రెడ్డి చీకట్లో మాట్లాడుకుని.. తెల్లవారాకా పోట్లాడుకుంటారని ఆరోపించారు. TRS , BJP కలిసి దొంగనాటకాలాడుతున్నాయని ఫైర్ అయ్యారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు రాకపోవడానికి కేసీఆర్ తో ఒప్పందమే కారణమన్నారు. బీజేపీ నేతలు టీఆర్ఎస్ కు సహకరించడం వల్లే బీజేపీకి డిపాజిట్లు రాలేదన్నారు.

కేసీఆర్ తో ఒప్పందం ప్రకారమే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచారన్నారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ వీక్ క్యాండిడేట్ ను పెట్టిందన్నారు. అలాగే.. ఎంపీ ఎలక్షన్ల టైంలో నారాయణ గూడ లో దొరికిన బీజేపీ డబ్బుల కేసు ఏమైందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి తలసాని హైకోర్టులో కేసు వేసినా.. అది పక్కన పడేశారన్నారు.

బండి సంజయ్ పై కరీంనగర్ లో జరిగిన దాడి గురించి ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. "కరీంనగర్ లో పోలీసులు బండి సంజయ్ గల్లా పట్టుకుంటే పార్లమెంట్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ కేసు ఏమైంది..? ఎందుకు ఆ పోలీసులపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు." సెక్రటేరియట్ లో నల్లపోచమ్మ గుడి కూలిస్తే కనీసం వెళ్లి పరిశీలించడానికి కిషన్ రెడ్డికి టైం దొరకలేదా..? అని ప్రశ్నించారు.

ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన శ్రీధర్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు రేవంత్. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన శ్రీధర్ రెడ్డిన టీఆర్ఎస్ లోకి పంపించి.. తనకు సన్నిహితుడైన కాంగ్రెస్ నేతను బీజేపీలోకి తీసుకున్నారన్నారు. దీని వెనక ఉన్న మతలబేంటని ప్రశ్నించారు.

"ఫోన్ లు ట్యాపింగ్ చేస్తున్నారని కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న విషయం మరిచిపోయినట్టున్నారు. ట్యాపింగ్ వ్యవహారం ఆయన శాఖ పరిధిలోనే ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు.." అని అడిగారు.

"కిషన్ రెడ్డి కి.. మై హోం రామేశ్వర్ రావుకు ఉన్న సంబంధమేంటీ..? రామేశ్వరరావు ను వెంట పెట్టుకుని పార్లమెంట్ లో కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి చుట్టూ ఎందుకు తిరిగినవ్..? కేసీఆర్ కు పెట్టుబడులు పెట్టేది రామేశ్వరరావు... రామేశ్వరరావు పల్లకి మోసేది మీరు.." అంటూ రేవంత్ ఫైరయ్యారు.

Next Story
Share it