Top
Batukamma

ఈ నెల 25న సీఎంగా కేటీఆర్ ప్రమాణం..! కానీ అక్కడే దొరికిపోయాడు..

ఈ నెల 25న సీఎంగా కేటీఆర్ ప్రమాణం..! కానీ అక్కడే దొరికిపోయాడు..
X
Highlights

తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. దీనికి...

తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుల్ స్టాప్ పెట్టారు. అడ్డగోలుగా మాట్లాడితే పార్టీలోంచి సస్పెండ్ చేస్తానని నేతలను హెచ్చరించారు.

అయితే.. దీనిపై నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో జోరుగా కథనాలు వచ్చినా.. ఇప్పుడు అంతా సైలెంట్ అయిపోయింది. కానీ.. అక్రమార్కులు మాత్రం దీన్ని ఇప్పటికీ అడ్డగోలుగా వాడేస్తున్నారు. ఏకంగా ప్రమాణస్వీకార కార్యక్రమం కూడా పెట్టేస్తున్నామంటూ డబ్బులు దండుకుంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం ఎవ్వారిపేటకు చెందిన బుడుమూరు నాగరాజు మాజీ రంజీ క్రికెట్‌ ప్లేయర్‌. కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడ్డాడు. ఈజీగా మనీ సంపాదించే మార్గాలపై ఫోకస్ పెట్టాడు.

ఏకంగా తాను కేటీఆర్ పీఏనని చెప్పి రెయిన్ బో హాస్పిటల్ కు ఫోన్ చేశాడు. హాస్పిటల్ ఎండీ రమేష్ ఫోన్ నంబర్ తీసుకుని అతనికి ఫోన్ చేశాడు.

తు కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డినని పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 25న ఎల్బీ స్టేడియంలో కేటీఆర్ ప్రమాణస్వీకార కార్యక్రమం గ్రాండ్ గా జరగబోతోందని చెప్పాడు. దీనికి సంబంధించి మీడియా ప్రకటనల కోసం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరాడు.

అయితే.. ఇటీవల వార్తలు చూసిన ఆయనకు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం లేదని ముందే తెలుసు. దీంతో అనుమానం వచ్చిన ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ చాలామందికి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు.

- Horoscope Telugu today : ఈ రాశుల వారికి వ్యాపారాలు కలిసివస్తాయి

- AP panchayat Results:ఫలితాలతో నిమ్మగడ్డకు షాక్.. జోష్ లో వైసీపీ..!

- Shabnam ali : దేశంలోనే తొలిసారి ఓ మహిళకు ఉరి. ఎవరామె..?

- ఆమె గాత్రం ఎంతో మధురమో.. ఆమె రూపం అంత అద్భుతం.. !

Next Story
Share it