Top
Batukamma

ఇవాలే అసెంబ్లీ స్పెషల్ సెషన్... చర్చించేది వీటిపైనే..!

ఇవాలే అసెంబ్లీ స్పెషల్ సెషన్... చర్చించేది వీటిపైనే..!
X
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు పావులు కదుపుతోంది. అందుకే ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసింది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సెషన్ కు రెడీ అయ్యింది. ఇవాళ అసెంబ్లీ, రేపు మండలి సమావేశం కానున్నాయి. కీలక బిల్లుల్లో సవరణల కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ, రిజిస్ట్రేషన్లు, ఇతర చట్టాలకు సంబంధించిన సవరణ బిల్లులు అసెంబ్లీ ముందుకు రానున్నాయి.

ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో రిజిస్ట్రేషన్ల చట్ట సవరణ బిల్లు, నాలా చట్ట సవరణ బిల్లు, రెవెన్యూ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెడతారు. మున్సి పల్ మంత్రి కేటీఆర్.. జీహెచ్ఎంసీ చట్టం -1995కి సవరణల బిల్లును, సీఆర్పీసీ చట్ట సవరణల బిల్లును హోంమంత్రి మహమూద్ అలీ సభలో ప్రవేశపెడతారు. వీటిపై సభలో చర్చించి , సీఎం సమాధానం తర్వాత ఆమోదిస్తారు. బిల్లుల ఆమోదం తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.

బుధవారం ఉదయం 11 గంటలకు శాసనమండలి సమావేశం కానుంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను కౌన్సిల్లో పెట్టి.. ఆమోదింపజేసుకోనున్నారు. బిల్లుల కోసమే సభ పెడుతుండటంతో.. రెండు సభల్లోనూ క్వశ్చర్ అవర్ను రద్దు చేశారు.

మున్సి పల్ యాక్ట్ మాదిరిగానే జీహెచ్ఎంసీ చట్టం లో ఎలక్షన్ల నిర్వహణ, వార్డుల రిజర్వేషన్లు, మహిళల కోటా పెంపు, ఇద్దరు పిల్లల రూల్, వార్డు కమిటీల ఏర్పాటు, గ్రీన్ కవర్ పెంపొందించడం తదితర సవరణలు ప్రతిపాదించారు. ఈ సవరణలకు ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశం కూడా ఓకే చెప్పింది.

గ్రామాలు, పట్టణాల శివార్లలోని వ్యవసాయ భూమిని కమర్షియల్ గా కన్వర్షన్ చేయడంలో అక్రమాలు జరుగుతుండటంతో నాలా చట్టాన్ని సవరించాలని సర్కారు నిర్ణయించింది. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆటో మెటిక్ గా నాలా కన్వర్షన్ అయ్యేలా అవకాశం కల్పించేందుక ప్లాన్ చేస్తున్నారు. అలాగే.. ధరణి పోర్టల్లో సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను మార్చనున్నారు. అలాగే కొత్త రెవెన్యూ చట్టంలోనూ కొన్ని సవరణలు చేయనున్నారు.

Next Story
Share it