Top
Batukamma

కార్లు పోతే కార్లు.. బైకులు పోతే బైకులు.. గ్రేటర్ ఓటర్లకి బీజేపీ బంపర్ ఆఫర్స్

కార్లు పోతే కార్లు.. బైకులు పోతే బైకులు.. గ్రేటర్ ఓటర్లకి బీజేపీ బంపర్ ఆఫర్స్
X
Highlights

దుబ్బాకలో సత్తా చాటిన బీజేపీ GHMC ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ పైన తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమైంది. అందులో భాగంగా నగర వాసులకు భారీ ఆఫర్స్ ఇచ్చేసింది.

దుబ్బాకలో సత్తా చాటిన బీజేపీ GHMC ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ పైన తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమైంది. అందులో భాగంగా నగర వాసులకు భారీ ఆఫర్స్ ఇచ్చేసింది. ఈ ఎన్నికల్లో మేయర్ సీటు దక్కితే వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం చేస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ వెల్లడించారు.

వరదల వలన ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇళ్లు కూలిపోతే ఇళ్లు కట్టిస్తామని, బైక్‌లు పోతే బైక్‌లు కొనిస్తామని, కార్లు పోతే కార్లు కొనిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. వీటికి తోడుగా యూత్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. చలాన్ల పేరిట ఇష్టానుసారంగా భాగ్యనగర పరిధిలో వసూలు చేసిన చలాన్లను మొత్తం మేమే కడతామని హామీ ఇచ్చారు.

ఇక టీఆర్ఎస్ పైన, సీఎం కేసీఆర్ పైన విమర్శలు చేశారు బండి సంజయ్. మేయర్ సీటును MIM ని కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని అన్నారు. అటు వరద సాయం ఆపాలని తాను ఎన్నికల సంఘాన్ని కోరలేదని, ఇది కేసీఆర్ కుట్రేనని అన్నారు. నిజంగా కేసీఆర్ హిందువైతే రేపు మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చెప్పాలన్నారు.

Next Story
Share it