Top
Batukamma

Telangana CM:సారు మంచోడే కానీ.. అక్కడే దెబ్బెసిందట..!

Telangana CM:సారు మంచోడే కానీ.. అక్కడే దెబ్బెసిందట..!
X
Highlights

ఇలా చాలా స్టేజ్ లలో ఇప్పుడు అవినీతి పెచ్చుమీరిపోయిందనేది నగ్న సత్యం. ఏ పని కావాలన్నా దానికో రేటు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎక్కడ చూసినా జనం తిరగబడుతున్నారు. దీనికి కారణం రాష్ట్రంలో అవినీతి, అధికార పార్టీ నేతల అక్రమాలు పెరిగిపోవడమే. సీఎం స్థాయి నుంచి కిందిస్థాయి వరకు ప్రతీ ఒక్కరు.. తమ తమ స్థాయిలో జులుం చూపిస్తున్నారనే వార్తలు ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం.

అధికార పార్టీలో ఉంటే ఏదైనా చేయొచ్చనే ధీమాతో చెలరేగిపోతున్నారు లీడర్లు. కబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్ లు, ఆఖరికి హత్యా ఆరోపణలు ఎదుర్కొన్న లీడర్లు కూడా ఉన్నారు. అన్నీ కళ్ల ముందే జరుగుతున్నా.. వాటికి సంబంధించిన వార్తలు.. అధికార పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న వారి న్యూస్ పేపర్లలో వస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.

లీడర్లే కాదు.. వాళ్ల కింద పని చేసే పీఏలు, పీఆర్వోలు, వారి కింద పనిచేసేవాళ్లు.. ఇలా చాలా స్టేజ్ లలో ఇప్పుడు అవినీతి పెచ్చుమీరిపోయిందనేది నగ్న సత్యం. ఏ పని కావాలన్నా దానికో రేటు పెట్టేసి అందినకాడికి లాగేసుకుని జేబులు నింపుకోవడం తప్ప.. జనానికి పెద్దగా చేసిందేం లేదనే ప్రచారం జరుగుతోంది.


రాజకీయాలన్నాక అవినీతి కామన్. కానీ ఇప్పుడది చేయిదాటిపోయింది. తెలంగాణ ఉద్యమ నినాదాన్ని పక్కన పెట్టేసి.. ఎంత దొరికితే అంత జేబులో వేసుకోవడమే అలవాటైంది. ఏ తప్పు జరిగినా.. నేను ఫలానా సార్ మనిషిని.. నాకు ఫలానా ఎమ్మెల్యే తెలుసు.. మంత్రి తెలుసు అంటూ రెచ్చిపోతున్నారు.

నిన్నటికి నిన్న హైదరాబాద్ లో రాంగ్ రూట్ లో వస్తున్న ఓ వ్యక్తిని ఆపితే ఏకంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పాట్ వచ్చి రచ్చ రచ్చ చేశారు. ఆపిన ఎస్సైని బండబూతులు తిట్టారు.

ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే.

ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ పీకలమీదికి వచ్చాయి. టీఆర్ఎస్ నేతల ఓవరాక్షన్ కు జనమే కాదు.. ప్రభుత్వ సిబ్బంది కూడా విసిగిపోయారు. దీనికి తోడు బీజేపీ జోరు పెరగడంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అసలే మళ్లీ ఎలక్షన్ మూడ్ మొదలైంది.

ఇలాంటి పరిస్థితుల్లో జనంలో ఉన్న చెడ్డపేరును తొలగించుకోకుండా.. ఎన్ని పథకాలు ప్రకటించినా పైసా ఉపయోగం లేదని సారుకు అర్థమైనట్టుంది.


అందుకే కొత్త నాటకం మొదలుపెట్టారనేది ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం. "వ్యవస్థలో జరుగుతున్న అవినీతిపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టరు. వారు ఏ స్థాయి వ్యక్తులైనా సరే. సారుకు కోపమొస్తే మామూలుగా ఉండదు.." జనంలో ఈ ఒపినియన్ రావాలనేది ఇప్పుడు కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

అందులో భాగంగానే తాను ఏరి కోరి మరీ తెచ్చుకుని పీఆర్వోగా పెట్టుకున్న విజయ్ కుమార్ ను ఇంటికి సాగనంపారు. ట్రాక్స్ కో జనరల్ మేనేజర్ పదవి నుంచి కూడా తప్పించారు. అవినీతి జరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ తన ప్రో మీడియాలో స్టోరీలు రాయించారు.

"ఓవరాల్ గా సారు మంచివాడే.. కానీ కింద ఉన్న సిబ్బంది, అధికారులు, నేతల వల్ల చెడ్డపేరు వస్తోంది.. వారిని కూడా ఇప్పుడు సెట్ రైట్ చేస్తున్నాడు కాబట్టి.. అంతా సెట్ రైట్ అవుతుందనే.." అభిప్రాయం జనంలో కలగాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

సో.. ఈ ప్లాన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే..!

- యాంకర్ శ్యామల వయ్యారాలు.. కేకో కేక... !

- మళ్ల కనబడితే.. కాళ్లు విరగ్గొడతా..! పీఆర్వోకి సీఎం వార్నింగ్..!

- CM KCR పీఆర్వో విజయ్ రాజీనామా వెనక అసలు కథ ఇదేనట..!

- పైన పటారం.. లోన లొటారం.. యాంకర్ అనసూయ రచ్చ రచ్చ.. !

- ఈషా రెబ్బా.. ఈ ఫోటోలు అదిరయబ్బా.. !

Next Story
Share it