Top
Batukamma

మళ్ల కనబడితే.. కాళ్లు విరగ్గొడతా..! పీఆర్వోకి సీఎం వార్నింగ్..!

మళ్ల కనబడితే.. కాళ్లు విరగ్గొడతా..! పీఆర్వోకి సీఎం వార్నింగ్..!
X
Highlights

సీఎం కేసీఆర్ పీఆర్వో గటిక విజయ్ కుమార్ రాజీనామా వ్యవహారం సీఎంవోలో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీగా అవినీతి జరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ పీఆర్వో గటిక విజయ్ కుమార్ రాజీనామా వ్యవహారం సీఎంవోలో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారీగా అవినీతి జరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. అవినీతి లెక్కలు చాలానే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

కేవలం డబ్బులు దండుకోవడం మాత్రమే కాదు. వ్యాపారాలు, సీఎం పేరు చెప్పి బెదిరింపులు.. ఇలా చాలా వ్యవహారాలు నడుస్తున్నాయని సీఎం దృష్టికి వచ్చినట్టు సమాచారం. అందుకే నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగి యాక్షన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

చీఫ్ మినిస్టర్ కార్యాలయ ప్రక్షాళనలో భాగంగా చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అందులో మొదటి వికెట్ గా విజయ్ కుమార్ కు ఉద్వాసన పలికినట్టు సమాచారం. అవినీతి లిస్ట్ లో మొదటి స్థానంలో ఉండటంతోనే అతడిని బయటకు పంపారని తెలుస్తోంది.

సీఎం పీఆర్వో ఆఫీసులో ఉన్న వారు.. ఏకంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని సమాచారం. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి అందులో ఫ్లాట్స్ తీసుకోవడం వంటి చాలా దందాలు జరిగాయిన సీఎంకు చాలా కంప్లైంట్లు వచ్చాయట.

ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ గా ఉండి.. సీఎం పీఆర్వోగా డిప్యూటేషన్ పై కొనసాగుతున్నరు గటిక విజయ్ కుమార్. గతంలో మీడియాలో చేసిన అనుభవం, పలుకుబడి.. ఇప్పుడు ఏకంగా సీఎం పీఆర్వో గా ఉండటంతో ఆయన విచ్చలవిడిగా రెచ్చిపోయారని సీఎం దృష్టికి వచ్చిందట.

ఏకంగా ట్రాన్స్ కో లో 24 కోట్ల రూపాయల మింగేసినట్టు సమాచారం. అంతే కాదు.. హైదరాబాద్ కొండాపూర్ లో ఓ హై క్లాస్ అపార్ట్ మెంట్ లో.. ఆ రియల్టర్ ను బెదిరించి తన కులస్తులకు 18 మందికి ఫ్లాట్స్ ఇప్పించినట్టు ప్రచారం జరుగుతోంది.

మరో ముగ్గురు మంత్రుల పీఆర్వోలతో కలిసి ఈ దందా నడిపిస్తున్నట్టు మీడియా సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇవే కాదు.. గటిక విజయ్ కుమార్ పై ఇంకా చాలా రకాల ఫిర్యాదులు సీఎంకు వచ్చాయట. దీంతో సీరియస్ అయిన ఆయన.. ఏరి కోరి మరీ తెచ్చుకున్న విజయ్ కుమార్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారట. మరోసారి కనిపిస్తే కాళ్లు విరగ్గొడతానని కాస్త గట్టిగానే చెప్పారట. విజయ్ కుమార్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మరీ ఇంటికి పంపారని తెలుస్తోంది.

Next Story
Share it