Top
Batukamma

ఇలాంటి మాటలు విన్నపుడు టీఆర్ఎస్ ఓడిపోవాలే అనిపిస్తది. !

ఇలాంటి మాటలు విన్నపుడు టీఆర్ఎస్ ఓడిపోవాలే అనిపిస్తది. !
X
Highlights

మీకు శత్రువు ఎంతటి మతతత్వ పార్టో... మీ దోస్తు పార్టీ అంతే మతత్వ పార్టీ.

కొట్లాడి తెలంగాణ తెచ్చిన : కేసీఆర్

చావు నోట్లే తల పెట్టి తెలంగాణ తెచ్చిన : కేసీఆర్

ఈ బక్కోడే తెలంగాణ తెచ్చిండు : కేసీఆర్

కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన : కేసీఆర్

రక్తపు చుక్క చిందకకుండా తెలంగాణ తెచ్చిండు : కేటీఆర్

ఇలాంటి మాటలు విన్నపుడు టీఆర్ఎస్ ఓడిపోవాలే అనిపిస్తది. !

1500 మంది అమరులు ఎందుకైనట్టు...?

వేల మంది మీద కేసులెందుకైనట్టు..?

లక్షల మంది ఉద్యమం ఎందుకు చేసినట్టు...?

కోట్లమంది ఒక్కటై దేనికోసం గొంతెత్తినట్టు...?

టీఆర్ఎస్ పుట్టకముందే తెలంగాణ కోసం కొట్లాడినోళ్లు, మాట్లాడినోళ్లు, రాసినోళ్లు, ఆడినోళ్లు, పాడినోళ్లు ఎందరో ఉన్నరు. అప్పుడు కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నడు. పదవిలో ఉన్నంతకాలం తెలంగాణ పలుకే లేదు. టీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఉద్యమానికి ఊపు వచ్చింది నిజం. కాని అన్ని పార్టీలు, ఉద్యోగ, ప్రజాసంఘాలు జేఏసీ జెండా కింద కొట్లాడినయి. బలిదానాలు జరిగినయి. అమరులైంది మామూలు యువతేగాని ఏ నాయకుడి కొడుకులు, బిడ్డలు కాదు.

తెలంగాణ వచ్చిన తర్వాత అమరుల త్యాగాలు‌, కోట్ల మంది పోరాటాలు అన్ని దాస్తూ...నేనే తెలంగాణ తెచ్చిన, మా డాడే తెలంగాణ తెచ్చిండు అని ప్రచారం చేయడం దుర్మార్గం, అహంకారానికి నిదర్శనం. ఇంకో పదేళ్ల తర్వాత కేసీఆర్ ఒక్కడే కొట్లాడి తెలంగాణ తెచ్చిండని నమ్మించి భవిష్యత్ తరాలకు చెబుతారేమో. ఒక ఎంపీగా కొట్లాడి రాష్ట్రం తెచ్చిన మీకు ముఖ్యమంత్రిగా ఏడు ముంపు మండలాలు తేవడం ఎందుకు సాధ్యం కాలేదు మరి?


మొదటిసారి గెలిచినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఓటుకు నోటు కేసుతో సాకుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారు. ఓకే. మరి రెండో సారి 88 మందిని గెలిపించినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు లాక్కున్నారు...? వాళ్లు రాకుంటే ప్రభుత్వం పడిపోయేదా...? ప్రతిపక్షం ఉండొద్దు, ప్రజాసంఘాలు మాట్లాడొద్దు. మీకు నచ్చని ఉద్యమకారులు మాట్లాడొద్దు.

కాని ఉద్యమం లేదన్నోళ్లు మంత్రులు, ఉద్యమ కారులపై లాఠీలు ఎత్తినోళ్లు మీ పార్టీఎమ్మెల్యేలు. వాళ్లకు పదవులు ఇవ్వకుంటే మీరు అనుకునే బంగారు తెలంగాణ సాధ్యం కాదా...?

ఉద్యమాన్ని ఉర్రుతలూగించిన ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద అడుగుపెట్టి సమస్యలు తెలుసుకోరు. ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే మాట్లాడరు, కరోనా టైంలో ప్రైవేటు ఆస్పత్రి దోపిడీ ఆపరు, కరోనా వైద్యం ఆరోగ్య శ్రీ లో చేర్చరు. కేసులు తక్కువ ఉన్నప్పుడు టీవీల టీఆర్పీ పెంచి, కేసులు పెరుగుతుంటే ఎక్కడుండ్రో ఎవరికీ తెలియదు. ఉస్మానియా ఆస్పత్రి మురుగు నీళ్లతో నిండితే చూసే టైం ఉండదు.

శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది చనిపోతే నివాళి అర్పించే తీరిక ఉండదు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోతే ఓదారచ్చే టైం ఉండదు. కని హీరోలు, సెలబ్రిటీలు చస్తే మాత్రం తప్పకుండా పోతరు. హైదరాబాద్ వరదల్లో ఉంటే సీఎం గారు ఫాంహౌస్ లో ఉంటారు. వచ్చి చూస్తే మీ కిరీటం కింద పడుతుందా. బాధల్లో ఉన్నవారిని ఓదార్చడం మీకు చిన్నతనం అనిపిస్తుందా ?


తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్షలు చేసిన జగన్ తో కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ చేపిస్తరు. ఆంధ్రా కాంట్రాక్టర్లు దోపీడీదారుని ప్రచారం చేసి..ఇప్పుడు వాళ్లకే తెలంగాణ కాంట్రాక్టులు ఇస్తరు. పేదోడికి ఇల్లు కట్టకునే జాగ ఇవ్వలేరు...స్వామీజీలకు రూపాయికే ఎకరం ఇచ్చేస్తరు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఏమైందో తెల్వది. నయీంతోటి దోస్తానా చేసిన లీడర్లు సేఫ్. ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ముట్టుకోరు సామాన్యుడి గుడిసేలు కూల్చేస్తారు.

మీరు పుట్టినందుకే ఆ ఊరిలో ఇంటికి 10 లక్షల సాయం చేస్తే... మిమ్మల్ని సీఎం చేసిన మాకెందుకు ఇవ్వరు. మంచి జరిగితే మీ గొప్పతనం... చెడైతే గత పాలకుల పాపం.

నోట్ల రద్దు వల్ల జనం ఇబ్బందులు పడుతుంటే అదో అద్భుతమైన నిర్ణయం అంటూ అసెంబ్లీలో మోడీని పొగుడ్తరు. జీఎస్టీ సూపర్ అంటరు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థించి...నిజామాబాద్ లో కవితక్క ఓడిపోగానే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి బీజేపీ శత్రువు అనేలా ప్రచారు షురూ చేశిండ్రు. కాంగ్రెస్ ను ఖతం చేసిన తర్వాత ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడం కష్టం అని మీకు కూడా తెలుసు.

గ్రేటర్ లో బీజేపీ ఎన్ని సీట్లు గెలిచినా...అది మీ ఓటమే.

రేపోయే కాలానికి మీకు చుక్కలే. అంతా మీరు చేసుకుంటుందే. మీకు శత్రువు ఎంతటి మతతత్వ పార్టో... మీ దోస్తు పార్టీ అంతే మతత్వ పార్టీ.

మతాల మధ్య చిచ్చు పెట్టె పార్టీలు వద్దనే ఒకే ఒక కారణంతో, మరే ప్రత్యామ్నాయం లేక... మీరు నచ్చని చాలామంది కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు తప్పితే మీ పాలన గొప్పతనం చూసైతే కాదు.

ఇట్లు...

హైదరాబాద్ మీద అమితమైన ప్రేమతో...

రఘు భువనగిరి

- ఎలా ఉండే సనా ఖాన్.. ఎలా మారిదో చూడండి..!

- రకుల్.. రచ్చహ... రచ్చస్య... రచ్చోభ్యహ!

- బిగ్ బాస్ లో నాగార్జున వర్సెస్ హారిక..!

Next Story
Share it