సంజయ్ అంటే పోలీసులకు ఎందుకు పడటం లేదు..?

బండి సంజయ్ కి పోలీసులకు మధ్య అస్సలు పొసగడం లేదు. ప్రతీసారి పోలీసులు సంజయ్ ని టార్గెట్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
Telangana police vs bandi sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ పోలీసులకు అస్సలు పడటం లేదు. పోలీసులకు ఆయనకు మధ్య పచ్చిగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి వచ్చింది. సిద్దిపేటలో బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా జరిగిన పరిణామాలతో ఈ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది.
రఘునందన్ రావును కలిసేందుకు సిద్దిపేట వెళ్లిన బండి సంజయ్ ని పోలీసులు మధ్యలోనే ఆపేశారు. అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ సందర్భంగా కాస్త కఠినంగా వ్యవహరించారు. సంజయ్ పోలీసు వాహనంలోకి బలవంతంగా తోసేశారు. ఈ తోపులాటలో ఆయనకు స్వల్పంగా గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది.
Strongly condemn assault & unjustifiable arrest of Sri @bandisanjay_bjp Garu MP & State President, @BJP4Telangana & Other Important Leaders of @BJP4India in Siddipet Dist of #Telangana is an undemocratic & disgraceful act by the #TelanganaStatePolice & #KCR led Govt of Telangana pic.twitter.com/ceD3YzJ3FQ
— Baddam Mahipal Reddy (@baddammahipal_b) October 26, 2020
అయితే.. సాధారణంగా ఓ ప్రజాప్రతినిధి.. అది కూడా ఓ ఎంపీ స్థాయిలో, పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి విషయంలో పోలీసులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ సంజయ్ విషయంలో పోలీసులు దారుణంగా వ్యవహరించారని బీజేపీనేతలు ఆరోపిస్తున్నారు.
ఇప్పుడే కాదు.. గతంలోనూ బండి సంజయ్ కి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆర్టీసీ సమ్మె సమయంలో చనిపోయిన ఓ డ్రైవర్ అంత్యక్రియల సందర్భంగా పెద్ద గొడవ జరిగింది. ఓ పోలీసు అధికారి ఆయనపై చేయి చేసుకున్నారు. గల్లా పట్టి తోసేశారు.
ఇది అప్పట్లో సంచలనం అయ్యింది. అప్పుడు ఆయన ఎంపీగా మాత్రమే ఉన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా అర్థరాత్రి వరకు కరీంనగర్ పట్టణంలో ఆందోళన కొనసాగించారు. డైరెక్ట్ గా వెళ్లి సీపీ క్యాంప్ ఆపీస్ ముందే బైటాయించారు. పోలీసులు క్షమాపణ చెప్పాకే ఆందోళన విరమించారు. ఇప్పుడు సిద్దిపేటలోనూ పోలీసులు అదే దురుసు తనాన్ని ప్రదర్శించారు.
సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్.. పళ్లు కొరుకుతూ తనపైకి వచ్చారని సంజయ్ ఆరోపిస్తున్నారు. ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తిపైకి అలా దూసుకెళ్లడం కరెక్ట్ కాదనే మాట వినిపిస్తోంది. పరిస్థితి నిజంగానే చేయి దాటిపోతోందనిపించినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాలి. కానీ ఏదో పర్సనల్ కోపం ఉన్నట్టు పోలీసులు (Telangana police vs bandi sanjay) వ్యవహరించారనేది బీజేపీ నేతల వాదన.
తెలంగాణ పోలీసుల తీరుపై గతంలో ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశారు సంజయ్. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే జరగడంతో ఇష్యూ ఎక్కడి వరకు వెళ్లిందనేది హాట్ టాపిక్ అయ్యింది.