Top
Batukamma

తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపు.. త్వరలో.. ఎంతంటే..?

తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపు.. త్వరలో.. ఎంతంటే..?
X
Highlights

హైదరాబాద్ సిటీలో రూ.10 రూ.15 రూ.20 ఇలా చార్జీలను రౌండ్ ఫిగర్ కు మార్చేశారు.

Telangana RTC charges :నిత్యావసరాలు, పెట్రల్, డీజిల్ ధరలు పెరిగి తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. త్వరలో ఆర్టీసీ చార్జీలు(tsrtc charges) పెంచేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కరోనా తర్వాత బస్సులు పూర్తిస్థాయిలో ఇంకా రోడ్డెక్కలేదు. దీంతో ఉద్యోగుల జీతాలివ్వడం కూడా ఇబ్బంది మారిందట.

దీనికి తోడు ఇంధన రేట్లు(fuel rates) పెరగడం కూడా ఆర్టీసీకి భారంగా మారిందట. గతంతో పోల్చుకుంటే ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ(rtc occupancy) భారీగా పడిపోయింది. ఆక్సుపెన్సీ 100 శాతానికి పైగా ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండేది ఆర్టీసీ పరిస్థితి. ఇప్పుడు జనాలు బస్సెక్కడమే మానేశారు. దీంతో మరింత భారం పెరిగిపోయింది.

ఈ భారాలన్నీ దిగిపోవాలంటే చార్జీలు పెంచడం తప్ప.. మరో మార్గం కనిపించడం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

2019లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తర్వాత చార్జీలు పెంచారు. కిలోమీటర్‌కి 20 పైసలు చొప్పున ఛార్జీలను పెంచారు. హైదరాబాద్ సిటీలో రూ.10 రూ.15 రూ.20 ఇలా చార్జీలను రౌండ్ ఫిగర్ కు మార్చేశారు. దీనిపై అప్పట్లో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు పెంచితే.. ప్రజలు సహించే పరిస్థితి లేదు. అయినా.. ప్రస్తుతం సంస్థ మీద ఉన్న భారం తగ్గాలంటే రేట్లు(charges hike) పెంచకతప్పదంటున్నారు. ప్రస్తుతం కిలోమీటర్ కు 15 పైసల చొప్పున పెంచాలని బావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆల్రెడీ దీనికి సంబంధించి ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు వెళ్లాయట. సూత్రప్రాయంగా ఆమోదం కూడా లభించినట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్, నాగార్జునా సాగర్ బై ఎలక్షన్స్ పూర్తయ్యాక రేట్ల పెంపు అనౌన్స్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

- ఈ నెల 25న సీఎంగా కేటీఆర్ ప్రమాణం..! కానీ ......

- Shabnam ali : దేశంలోనే తొలిసారి ఓ మహిళకు ఉరి. ఎవరామె..?

- ఆమె గాత్రం ఎంతో మధురమో.. ఆమె రూపం అంత అద్భుతం.. !

- ఈ నటి భర్త ఓ స్టార్ డైరెక్టర్ అన్న విషయం మీకు తెలుసా?

- త్రివిక్రమ్ లవ్ స్టొరీ కిరాక్.. అక్క కోసం వెళ్లి చెల్లిని పెళ్లి..!

Next Story
Share it