Top
Batukamma

షర్మిల పార్టీలోకి తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మామిళ్ళ..!

షర్మిల పార్టీలోకి తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మామిళ్ళ..!
X
Highlights

ఆయనని కలవాలని చాలాసార్లు అనుకున్నని కానీ కలవలేకపోయానని వెల్లడించింది.

Tollywood character artist Shailaja Priya meet YS షర్మిల: వైఎస్ షర్మిల(Ys sharmila) కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో రాజన్న రాజ్యం(rajanna rajyam) లేదంటూ కొత్త పార్టీని పెడుతున్నట్టుగా ప్రకటించి.. వరుసగా వైఎస్ అభిమానులతో సమావేశం అవుతున్నారు షర్మిల.

ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు ఆమెను కలిసేందుకు వస్తున్నారు. ఆమె పార్టీ(sharmila political party) పెడుతుండడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మామిళ్ళ శైలజప్రియ(mamilla shailajapriya) వైఎస్ షర్మిలను కలిశారు. శనివారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌లో షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... తానూ చిన్నప్పటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పెద్ద అభిమానని, ఆయనని కలవాలని చాలాసార్లు అనుకున్నని కానీ కలవలేకపోయానని వెల్లడించింది.

కానీ ఆయన కుమార్తె షర్మిల(sharmila) రాజకీయాల్లో వస్తున్నారని తెలిసి సంతోషించి అభినందించడానికి వచ్చానని ప్రియ తెలిపింది. ఇక తనకి రాజకీయాల గురించి పెద్దగా తెలియదని, కానీ ప్రజలకి ఎదో ఒక మంచి పని చేయాలనీ వైఎస్ఆర్‌ను చూసి స్ఫూర్తి పొందానని చెప్పుకొచ్చింది.

అయితే మామిళ్ళ శైలజప్రియకి పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందని షర్మిల హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే షర్మిలను... తెలుగు యాంకర్ శ్యామల(anchor syamala) తన భర్తతో కలిసి మీట్ అయిన విషయం తెలిసిందే.. !

(వీడియో క్రెడిట్ : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి)


Next Story
Share it