Top
Batukamma

TPCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడుట లేదు..!?

TPCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడుట లేదు..!?
X
Highlights

గ్రేటర్ ఎన్నికల హీట్ మొదలైనా.. ఇప్పటికీ ఒకరిద్దరు నేతలు తప్పా ఎవరూ పెద్దగా బయట కనిపించడం లేదు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చాలా వరకు ఖాళీ చేసింది టీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను చాలా వరకు లాగేసుకుంది. దీంతో కిందిస్థాయి కేడర్ చాలా వరకు టీఆర్ఎస్ లోకి చేరిపోయింది.

అయితే.. గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం కొందరు నేతలు ముందు నుంచీ పార్టీలోనే ఉన్నారు. ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతూ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గ్రేటర్ ఎన్నికలతో కాంగ్రెస్ కు మరోసారి గడ్డు కాలం వచ్చింది.

ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్.. నడిస్తే.. ఇప్పుడు బీజేపీ.. కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించి తమవైపు లాగేసుకుంటోంది. దీంతో ఒక్కొక్కరుగా హస్తానికి టాటా చెప్పేసి అదే చేతితో కమలాన్ని పట్టేసుకుంటున్నారు.

గతంలో మేయర్ గా పనిచేసి బండ కార్తీక రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్.. ఇలా ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. మరికొందరు ముఖ్యనేతలు బీజేపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

ఇంత జరుగుతున్నా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల హీట్ మొదలైనా.. ఇప్పటికీ ఒకరిద్దరు నేతలు తప్పా ఎవరూ పెద్దగా బయట కనిపించడం లేదు.

మరీ ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అసలు పార్టీని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లు అంటే ప్రతీ పార్టీకి పెద్ద టాస్క్. వ్యూహ,ప్రతివ్యూహాల కోసం పార్టీ చీఫ్ లు ఎప్పటికప్పుడు సమావేశమవుతారు.

నవంబర్ ౧౪న చాచా నెహ్రూ జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడుతున్న ఉత్తమ్ కుామర్ రెడ్డి

కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదట. షెడ్యూల్ చేసిన మీటింగ్ లకు కూడా ఉత్తమ్ డుమ్మా కొడుతున్నారట. దీంతో గాంధీభవన్ వచ్చినవాళ్లంతా వెయిట్ చేసి.. చేసి.. ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారట.

పార్టీ స్టేట్ చీఫ్ పట్టించుకోకపోతే.. పార్టీలో ఉండటం ఎందుకని అంటున్నారట డివిజన్ స్థాయి ముఖ్యనేతలు. అందుకే ఎవరికి తోచిన దారి వారు చూసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికిప్పుడు టికెట్ రావాలంటే ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ బీజేపీ ఒక్కటే. అందుకే అంతా బీజేపీ వైపు వెళ్తున్నారు.

అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించి.. పార్టీలో కొనసాగేలా చేసుకోవడం అధ్యక్షుడి బాధ్యత. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవేవీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆయన.. కనీసం ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఉత్తమ్ తీరుపై పార్టీ నేతలు ఫుల్ గరం మీదున్నారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి పొసగడం లేదనే ప్రచారం ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి కాస్త హైలైట్ అవుతున్నారు. పీసీసీ పదవి కూడా రేవంత్ కే ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇది నచ్చకపోవడం వల్లే ఉత్తమ్ .. పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నారనే మాట వినిపిస్తోంది.

- ఈ సారి గులాబీ మేడంల వంతు..? మేయర్ సీటుకు ఫుల్ డిమాండ్

- పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న యాంకర్ శ్యామల

Next Story
Share it