టీఆర్ఎస్ కు నిజంగానే ఓటమి భయం పట్టుకుందా..?

ఎన్నికల టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అధికార టీఆర్ఎస్ అత్యుత్సాహం ప్రదర్శించిందా..? సిద్దిపేట గోడవకు కారణమేంటీ?
సాధారణంగా ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వచ్చే ఎన్నికలు చాలా కూల్ గా జరిగిపోతాయి. కానీ దుబ్బాక(dubbaka) విషయంలో అలా జరగడంలేదు. ఇష్యూ అన్ని పార్టీలకు ప్రెస్టీజియస్ గా మారింది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్, అసెంబ్లీలోకి తమ పార్టీ రెండో అభ్యర్థిని పంపించాలని బీజేపీ, గెలిచేది తామే అంటూ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి.
అంతా బాగానే ఉంది. కానీ సోమవారం రోజున బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేయడంతో గొడవ మొదలైంది. అర్థరాత్రి దాక సిద్దిపేటలో రచ్చ కొనసాగింది. డబ్బులు దొరికాయని పోలీసుల.. అవి తమ డబ్బులు కాదని పోలీసులే తెచ్చి పెట్టడానికి ప్రయత్నించారని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఒక్కరొక్కరుగా బీజేపీ ముఖ్యనేతలు సిద్దిపేట దారిపట్టడంతో ఇష్యూ సీరియస్ అయ్యింది. సిద్దిపేట దగ్గరిదాకా వచ్చిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని అరెస్ట్ చేసి మళ్లీ కరీంనగర్ తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన అక్కడే దీక్షకు కూర్చున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వ తీరు ముమ్మాటికీ ప్రశ్నిచదగ్గదే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ గారిపై పోలీసుల ద్వారా వ్యవహరించిన తీరు అమానుషం.@bandisanjay_bjp @BJP4Telangana pic.twitter.com/AMpa6b7BCP
— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 27, 2020
అయితే.. వారం రోజుల్లోనే ఎన్నికలు పెట్టుకుని అధికార పార్టీ ఇలాంటి పనులకు ఎందుకు పూనుకుందనేది ఇప్పుడు ఓ మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ఇప్పటిదాకా అంతా సాఫీగానే జరిగింది. వారం రోజులాగితే గెలిచేదెవరో తేలిపోతుంది. సరిగ్గా ఇదే టైంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ను.. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బదిలీ చేయాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజే రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. అయితే.. ఇతర పార్టీ నేతల ఇళ్లలోనూ సోదాలు జరిగాయని టీఆర్ఎస్ ప్రో మీడియాలో వార్తలొచ్చాయి.
కానీ రఘునందన్ రావు మామ ఇంటి దగ్గర పోలీసులు డబ్బు సంచితో తిరగడం పెద్ద ఇష్యూ అయ్యింది. వేరే ఇంటిలో డబ్బులు తెచ్చి తన మామ ఇంట్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రఘునందన్ రావు అక్కడే ఆందోళనకు దిగారు. ఇది కాస్త చినికి చినికి గాలి వానగా మారింది.
నోటుల కట్టలతో గోడ దుంకుతు పట్టు బడ్డ పోలీసులు, సిద్దిపేటలో పరిస్థితి ఉద్రిక్తత.
— AP Jithender Reddy (@apjithender) October 26, 2020
దుబ్బాక లో రఘునందన్ రావు గారి బంధువుల ఇంట్లో కావాలని పోలీసులతో డబ్బులు ఎలా పెట్టిస్తున్నారు మీరే చూడండి హరీష్ రావు గారు ఇదేనా మీ రాజకీయం.@bandisanjay_bjp @RaghunandanraoM #DubbakaBypolls pic.twitter.com/xXdK4wsYbJ
పోలింగ్ తేదీ దగ్గర పడిన సమయంలో బీజేపీ అభ్యర్థిని ఏ మాత్రం కదిపినా అది టీఆర్ఎస్ కు నెగెటివ్ గా మారుతుందనేది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అందులోనూ ఇలాంటి ఇష్యూలను వాడుకుని సింపతి కొట్టేయడంతో బీజేపీని మించిన వారుండరు.
ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనే సోదాలు చేశారనుకుందాం. అలాంటప్పుడు పోలీసులు నోటీసులు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. సోదాలయ్యాక డబ్బు దొరికితే పంచనామా రిపోర్ట్ రాసి వారికి ఓ కాపీ ఇవ్వాలి. అది కూడా జరగలేదని రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు.
అఫీషియల్ గా ఫాలో కావాల్సిన ఫార్మాట్ ఏదీ ఫాలో కాలేదని ఆరోపణలు వస్తున్నాయి. అందులోనూ రఘునందన్ రావు ఓ న్యాయవాది. ఏ చిన్న తప్పిదం జరిగినా గట్టిగా ప్రశ్నిస్తారు. కోర్టులో కేసు వేస్తారు. ఇష్యూ పెద్దదై బీజేపీకి ఫుల్ సింపతి వచ్చేస్తుంది.
కానీ ఇలాంటి అంశాలపై కనీసం అవగాహన లేనట్టు.. ఏదో గుడ్డెద్దు చేన్లో పడ్డట్టుగా వ్యవహారం ఎందుకు జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నిజంగానే దుబ్బాకలో (dubbaka) టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవా..? అనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది. గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఇలాంటి పనులతో ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
స్వయంగా సీఎం సొంత జిల్లా కావడంతో ఈ ఇష్యూ ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.