Top
Batukamma

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ.. గులాబీ బాస్ లకు షాక్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ.. గులాబీ బాస్ లకు షాక్..!
X
Highlights

టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల మధ్యే పోటి నడవనుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ముందే టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగలనున్నట్టుగా తెలుస్తోంది.

Trs Leader Teegala Krishnareddy : మరికొన్ని రోజుల్లో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి.. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల మధ్యే పోటి నడవనుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ముందే టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగలనున్నట్టుగా తెలుస్తోంది.

ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డ్తి టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కమలం గూటికి చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన తీగల మంచి విజయాన్ని సాధించారు.

అయితే టీఆర్ఎస్ ఆకర్షణలో భాగంగా కొన్ని రోజులకే సైకల్ దిగి కారు ఎక్కారు. . ఇక, 2018లో టీఆర్‌ఎస్ టికెట్‌పై మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రస్తుత మంత్రి సబితా ఇంద్రారెడ్డి పైన ఓడిపోయారు. అనేక రాజకీయ పరిణామాల తరవాత సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ లోనే చేరారు. ఆ తరవాత మంత్రి కూడా అయ్యారు. సో 2024 ఎన్నికల్లో మళ్ళీ అదే స్థానం నుంచి అయనకి టీఆర్ఎస్ నుంచి సీటు ఇచ్చే అవకాశం కూడా లేదు.

అటు ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటూ వస్తున్న తీగలకి ఆ మధ్య ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగింది కానీ అదేమీ నిజం కాలేదు. ఈ క్రమంలో అయన బీజేపీలో చేరి 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేసి గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం ఆయనని బుజ్జగించే పనిని మంత్రి మల్లారెడ్డి తీసుకున్నారని సమాచారం.


ఇక తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె మహేశ్వరం టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తీగల టీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెబితే ఆయన కోడలు అనితారెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారన్న ప్రచారం సాగుతోంది.

అయితే.. టీఆర్ఎస్ ప్రో మీడియాలో మాత్రం.. తీగల కృష్ణారెడ్డికి సంబంధించిన వార్త మరోలా వస్తోంది. బీజేపీ వాళ్లు రావాలని వెంటపడినా.. ఆయన మాత్రం ససేమిరా అన్నట్టు టీఆర్ఎస్ ప్రో మీడియా చెబుతోంది. టీఆర్ఎస్ లో తనకు సరైన గుర్తింపే ఉందని.. అందుకే కారు పార్టీలో కొనసాగుతానని.. పార్టీ మారే ఆలోచనే లేదని ఆయన(Trs Leader Teegala Krishnareddy) చెబుతున్నట్టు తెలుస్తోంది.

- విడాకులు తీసుకున్న మహిళతో మరో పెళ్లి.. కిడ్నాప్ అంటూ కొత్త డ్రామా!

- వైట్ డ్రెస్ లో హాట్ హాట్ గా అనసూయ!

Next Story
Share it