బిగ్ బ్రేకింగ్ : మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి!

టీఆర్ఎస్ పార్టీలో మరో విషాదం నెలకొంది. దుబ్బాక ఎమ్మెల్యే మృతి నుంచి బయటపడకముందే ఆ పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే మృతి చెందారు.
టీఆర్ఎస్ పార్టీలో మరో విషాదం నెలకొంది. దుబ్బాక ఎమ్మెల్యే మృతి నుంచి బయటపడకముందే ఆ పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే మృతి చెందారు. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు.
గత కొన్ని రోజులనుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆయన మంగళవారం తెల్లవారు జామున మృతిచెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయనని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. నోముల మృతితో, టీఆర్ఎస్ పార్టీలో, ఆయన కుటుంబసభ్యులు విషాదంలో నెలకొంది.
నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన నోముల నర్సింహయ్య నకిరేకల్ ఎమ్మెల్యేగా రెండు సార్లు ఉన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు. గతంలో సీపీఎం శాసనససభపక్షనేతగా పనిచేశారు.
తన సొంత జిల్లా అయిన నల్లగొండలో 2014 ఏ నియోజకవర్గం నుండి కూడా టికెట్ లభించక పోవడంతో మనస్తాపం చెంది సీపీఎంకు బై బై చెప్పి సీపీఎం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు నోముల నర్సింహయ్య టి.ఆర్.ఎస్.లో చేరారు.
2018 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి పైన ఆయన గెలిచారు.