Top
Batukamma

కవితని పక్కన పెట్టేసిన టీఆర్ఎస్ .. ఆ లిస్టులో దక్కని చోటు!

కవితని పక్కన పెట్టేసిన టీఆర్ఎస్ .. ఆ లిస్టులో దక్కని చోటు!
X
Highlights

GHMC ఎన్నికలకి ప్రధాన పార్టీలు అన్ని సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించిన ఆన్ని పార్టీలు ఇప్పుడు ప్రచారానికి సై అనేస్తున్నాయి.

GHMC ఎన్నికలకి ప్రధాన పార్టీలు అన్ని సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించిన ఆన్ని పార్టీలు ఇప్పుడు ప్రచారానికి సై అనేస్తున్నాయి. బీజేపీ ఇటీవలే స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించగా, తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ తమ క్యాంపెయినర్లను ప్రకటించింది.

సీఎం కేసీఆర్ తో పాటుగా మంత్రులు కేటీఆర్ హరీశ్ రావు, హోం మంత్రి మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్‌‌, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్‌‌ను స్టార్ క్యాంపెయినర్లుగా టీఆర్ఎస్ ప్రకటించింది.

అయితే ఇందులో సీఎం కూతురు కవితకి చోటు దక్కకపోవడం ఆశ్చరానికి గురిచేస్తోంది. ఇక కవిత సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ పాలనలో హైదరాబాదు ఎంత డెవలప్ అయిందో అందరకి తెలిసిందే అంటూ ఓ వీడియో సందేశాన్ని పంపారు కవిత.

అయితే టీఆర్ఎస్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేవలం మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఇద్దరు మహిళ మంత్రులు ఉన్నారు. అందుచేత కవితకి చోటు ఇవ్వలేదని తెలుస్తోంది. అటు GHMC ఎన్నికలకి నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

Next Story
Share it