Top
Batukamma

దెబ్బతిన్న పులి శ్వాస ఎంత భీకరంగా... వేట ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా..?

దెబ్బతిన్న పులి శ్వాస ఎంత భీకరంగా... వేట ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా..?
X
Highlights

అయ్యో ఇలా జరిగిందే.. ఆ సమస్య నన్ను తొక్కేసిందే.. అని ఏడుస్తూ కూర్చుంటే ఒరిగేదేముండదు.

TV9 Ravi Prakash attack on my home group : జీవితం అంటేనే ఓ వేట. గమ్యాన్ని సాధించేందుకు మనం.. మనల్ని సాధించేందుకు సమస్యలు.. ఒకదాని వెంట ఒకటి పరుగెడుతూనే ఉంటాయి. మనం ఓ గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నా.. కొన్ని సార్లు సమస్యలు దాన్ని కుప్పకూల్చేస్తాయి. అధ:పాతాళంలోకి తొక్కేస్తాయి.

అయ్యో ఇలా జరిగిందే.. ఆ సమస్య నన్ను తొక్కేసిందే.. అని ఏడుస్తూ కూర్చుంటే ఒరిగేదేముండదు. తెగించి పోరాడితేనే లక్ష్యాన్ని చేరుకుంటాం. మనను తొక్కేసిన సమస్యను.. మనం తొక్కేసే అవకాశాన్ని అందుకుంటాం.

ఇప్పుడు నూటికి నూరుపాళ్లు ఇదే పని చేస్తున్నారు రవి ప్రకాశ్. టీవీ 9 రవి ప్రకాశ్(tv9 raviprakash) గా ప్రపంచానికి సుపరిచితమైన ఈయన.. అదే పేరుతో పాతాళానికి తొక్కేయబడ్డాడు. ఏ ఛానల్ వేదికగా తాను ఎదిగాడో.. అదే ఛానల్ లో అతని అరెస్ట్ వార్త కూడా చూడాల్సి వచ్చింది.

తాను నాటి, నీరు పోసి.. ఎరువు వేసి పెంచిన టీవీ9(tv9) అనే మొక్కని వేరేవాళ్లు కబ్జా పెట్టేశారు. రవి ప్రకాశ్ ను జైల్లో తోసేశారు. వరుసగా కేసులు పెట్టి బయటకు రాకుండా చేశారు. అయినా ఎలాగోలా బయటకొచ్చాడు.


అసలే మీడియా(telugu media)లో అదో పెద్దపులి. దానికి అన్ని రకాల ఆకలి ఎక్కువేనంట. అలాంటి పులికి దెబ్బ తగిలింది. అది మామూలు దెబ్బకాదు. మరిచిపోలేని.. తుడిచేసుకోలేని దెబ్బ. మీడియా చరిత్రలో చిరకాలం ఉండిపోయే దెబ్బ.

అందుకే ఆ పులి ఇప్పుడు వేట మొదలుపెట్టింది. తాను పెంచిన చెట్టు నీడ నుంచి తనను తోసేసి.. తన పరువు తీసిన వ్యక్తులను వేటాడుతోంది. ఆ వేటకు వేదికే రాజ్ న్యూస్.

ఇన్ని రోజులు చాలా పార్టీల చేతులు మారిన రాజ్ న్యూస్ ను ఇప్పుడు రవిప్రకాశ్ సారథ్యంలో బీజేపీ టేకోవర్ చేసింది. రాష్ట్ర సర్కారుకు ప్రధాన ఫైనాన్షియర్ గా పేరున్న మైహోం రామేశ్వరరావు(myhome rameshwar rao) అక్రమాల చిట్టా విప్పుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు చప్పగా సాగిన రాజ్ న్యూస్(raj news) ఇప్పుడు ఫుల్ హీటు మీదున్నది.

ఎందుకంటే రవిప్రకాశ్ ఎంట్రీ ఇచ్చారు. తానొక్కడే కాదు.. టీవీ9లో ఉన్న తన బలగాన్ని తరలించుకుపోయాడు. టీవీ9, మోజోలోంచి తోసేయబడ్డ బలగాన్ని ఒక్కచోట చేర్చాడు. అంతా గాయపడ్డవారే. ఆ నొప్పిని భరిస్తున్నవారే. ఈ నొప్పికి ఉపశమం దొరికే సమయమొచ్చింది. నొప్పికి కారణమైన వారికి చుక్కలు చూపించే టైమొచ్చిందని.. వారిలో మరింత జోష్ నింపి ముందుకు తీసుకెళ్తున్నాడు.

అందుకే మై హోం సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి aha ఓటీటీ ప్లాట్ ఫాం వరకు అన్నింటిని టార్గెట్ చేశారు. ఎక్కడ లూప్ హోల్ దొరికితే అక్కడ దుమ్ము దులిపి వదిలేస్తున్నారు. భక్తుడని చెప్పుకుంటూ బూతుపురాణం నడిపిస్తున్నాడని చెడుగుడు ఆడేసుకుంటున్నారు.

న పరాభవానికి పరోక్షంగా సహకరించిన రాష్ట్ర సర్కారును వదలడం లేదు. మీడియా ఎథిక్స్ ను కాస్త పక్కకు పెట్టేసి మరీ .. సెన్సార్ షిప్ వదిలేసి బైట్స్ ప్లే చేస్తున్నారు. జనంతో బూతులు తిట్టిస్తున్నారు.

వీళ్లతో ఎందుకు పెట్టుకున్నానురా బాబు అని మైహోం రామేశ్వరరావు అనుకునేలా అదరగొడుతున్నారు.

కానీ..

ప్రత్యర్థి ఓ వ్యాపారవేత్త.. ఇక్కడున్నది నెలజీతానికి పనిచేసే ఉద్యోగులు(జర్నలిస్టులు). రేపటి రోజు ఇదే ప్రత్యర్థి బీజేపీ కండువా కప్పేసుకుంటే పరిస్థితి ఏంటీ..? ఇప్పుడు లంగ.. లఫంగా.. అని వార్తలు రాసిన జర్నలిస్టుల పరిస్థితి ఏంటీ..? మనతో రాయిస్తున్న మేనేజ్ మెంట్, మన ప్రత్యర్థి ఒక రోజు కలిసిపోయినా ఆశ్చర్చం లేదు.

సో.. బీకేర్ ఫుల్.. ఇప్పుడు నడుస్తున్నది పాలిటిక్స్ కాదు.. జర్నలిటిక్స్. ఇందులో ఎవరు ఎప్పుడు పావులుగా మారుతారో.. పాములై కాటేస్తారో గుర్తించడం కష్టం.

ఇవి కూడా చదవండి :

- ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో.. అతడే....!

- జీ హుజూర్... ఇక చాలు.. వదిలేద్దాం..!

- నిజమే.. 30 మంది కాదట.. 60 మంది BJPలోకి జంప్ కు రెడీ అంట..!

- కొత్త వ్యవసాయచట్టాలతో రైతులకంటే ఎక్కువ నష్టపోయేది మనమే..! ఎలాగంటే..

- ఈ 'రాక్షసుడు' పాప ఇప్పుడెలా ఉందొ చూడండి!

- తొడలు చూపించి టెంప్ట్ చేస్తున్న తెలుగు యాంకర్!

- రూట్ మార్చిన రామోజీ.. డైరెక్ట్ మోడీపైనే పోరాటం..!

- జీవితా రాజశేఖర్ లకి మిగిలింది ఇక ఆ రెండే..

Next Story
Share it