Top
Batukamma

దుబ్బాకలో ఓటు చాలా కాస్ట్ లీ.. ఓటు రేటెంతో తెలుసా..?

దుబ్బాకలో ఓటు చాలా కాస్ట్ లీ.. ఓటు రేటెంతో తెలుసా..?
X
Highlights

దుబ్బాక ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రానికి ముగిసింది. రేపు దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

దుబ్బాక ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రానికి ముగిసింది. రేపు దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా దుబ్బాకలో మోహరించాయి.

అయితే.. దుబ్బాకను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ మాత్రం దుబ్బాకలో గెలుపు తమదే అంటోంది. అసెంబ్లీలో తమ నంబర్ పెరుగుతుందని చెబుతోంది. ప్రచారం కూడా జోరుగానే కొనసాగించింది బీజేపీ. పార్టీ ముఖ్యనేతలంతా మోహరించి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

పోలింగ్ టైం దగ్గర పడటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో బిజీగా ఉన్నాయి. ఓటర్లకు భారీగా డబ్బులు పంచుతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం అక్రమమార్గాల్లో రహస్యంగా డబ్బులు తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.కొద్దిరోజుల క్రితం సిద్దిపేటలో బీజేపీ నేత రఘనందన్ రావు బంధువుల ఇంటిలో డబ్బులు దొరికాయి. నిన్న హైదరాబాద్ లో ఓ కంపెనీ నుంచి డబ్బు తీసుకుని వెళ్తున్న రఘునందన్ రావు బామ్మర్దిని పోలీసులు అరెస్ట్

అధికార పార్టీ నేతల ఇళ్లలో సోదాలు చేసినా డబ్బులు దొరకలేదని పోలీసులు తెలిపారు. అయితే.. టీఆర్ఎస్ నేతలు పోలీసుల సాయంతోనే డబ్బులు చేరవేస్తున్నారని.. కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి.ఏది ఏమైనా.. దుబ్బాకలో మాత్రం భారీగా డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ఓటరుకు వెయ్యి నుంచి 5 వేల రూపాయల వరకు ఇస్తున్నారని తెలుస్తోంది.

రాత్రికి రాత్రికి డబ్బులు సప్లై చేసి గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లకు చేరవేస్తున్నరనే ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు రోజులుగా దుబ్బాకలో మద్యం ఏరులై పారుతోంది. డబ్బు, మద్యం పంపిణీ విషయంలో ఏ పార్టీ వెనక్కి తగ్గడం లేదట. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. దుబ్బాక చాలా చర్చనీయాంశంగా మారింది.

దీంతో ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీంతో నలుగురు స్పెషలాఫీసర్లను నియమించింది. సాధారణంగా ఒక అబ్జర్వర్ ను మాత్రమే నియమిస్తారు. కానీ దుబ్బాకలో నలుగురు స్పెషలాఫీసర్లను పెట్టారు. ఇప్పటికే కలెక్టర్ ను బదిలీ చేశారు.

Next Story
Share it