Top
Batukamma

ఆ.... ఇంకెవరైనా మిగిలారా..? బీజేపీకి ఓట్ల వరదేనా ఇక..?

vijayashanti to join bjp
X
Highlights

ఓట్లు సెలబ్రిటీలు.. రైలు పట్టాల్లాంటివి. అయినా బీజేపీ ఆ పట్టాలను కలపాలని ప్రయత్నాలు చేస్తోందా.? బీజేపీ స్ట్రాటజీ ఏంటీ?

విజయశాంతి మళ్లీ బీజేపీలో చేరబోతోంది. ఇప్పుడిప్పుడే ఈ వార్త ట్రెండింగ్ అవ్వడం మొదలైంది. త్వరలోనే మళ్లీ బీజేపీ కండువా కప్పుకునేందుకు రాములమ్మ రెడీ అయిపోయిందట. వెళ్తే వెళ్తుంది. రాజకీయాలన్నాక పార్టీ మారరా ఏంటీ..?

అవును.. రాజకీయాలన్నాక పార్టీలు మారడం కామన్. అవసరమైతే కొత్త పార్టీ పెట్టడాలు వాటిని ఇతర పార్టీల్లో విలీనం చేయడాలు కామన్. అవసరమైతే పవన్ కల్యాణ్ మాదిరిగా పార్టీ పెట్టి.. మరో పార్టీకి సపోర్ట్ చేసే పరోపకారులు ఉంటారు.

మరి.. ఇప్పుడు విజయశాంతి బీజేపీలో చేరితే దాన్ని ఎందుకు అంత పెద్ద వార్తలాగా చెప్పుకోవాలి.

నిజమే విజయశాంతి బీజేపీలోకి వెళ్లడం అంత పెద్ద వార్తేమీ కాదు. కానీ.. దాని వెనకాలే అసలు వార్త ఉంది. ఎందుకంటే విజయశాంతి తనంతట తానుగా బీజేపీలోకి వెళ్లడం లేదు. బీజేపీ నేతలు వెంటపడి... బతిమిలాడి.. మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట.

ఎవరో చిన్నా చితకా నేతలు పోయి బతిమిలాడితే రాములమ్మ ఎందుకు వింటుంది.? ఆమెకు రావాల్సినవి.. కావాల్సినవి.. మాట్లాడుకోవాలి కదా.

అందుకే.. నేరుగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి రంగంలోకి దిగారన్నది ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్న వార్త. కేంద్రమంత్రి హోదాలో ఉన్న ఆయన.. విజయశాంతి ఇంటికెళ్లి మరి... కొన్ని రోజులుగా.. గంటల తరబడి చర్చలు నడిపిస్తున్నారట.

నిజంగా విజయశాంతి... ఓ కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి వెళ్లి బతిమిలాడి.. పార్టీలోకి తీసుకొచ్చుకునేంత స్టార్ లీడరా...?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే విజయశాంతి ట్రాక్ రికార్డు అలాంటిది. మొత్తం పొలిటికల్ కెరీర్ లో ఎన్నికల్లో గెలిచింది ఒకే ఒక్కసారి.

భారీ వక్త కాదు.. జనాన్ని ఎట్రాక్ట్ చేస్తుంది. మీటింగ్ పెడితే వేలాది మంది వస్తారంటే.. అదీ కాదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ప్రచారం చేసిన చోట.. కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. ఇప్పుడు తన సొంత జిల్లా ఉమ్మడి మెదక్ లోని దుబ్బాకలో బై ఎలక్షన్ జరుగుతున్నా.. ఆమె పెద్దగా కనిపించడం లేదు.

మరి ఇలాంటి విజయశాంతి వెంబడి ఎందుకు ఇంతలా పడుతున్నారు.? విజయశాంతి రావడం వల్ల బీజేపీ ఉపయోగం ఏమిటి..?

బాబూ మోహన్ రావడం వల్ల ఏం ఉపయోగం జరిగింది..? మాధవీలత కాషాయ కండువా కప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం జరిగింది...? ఇప్పుడు జరిగేది అంతే. ఏదో సినిమా స్టార్లు వాళ్లకు కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనేది బీజేపీ ఆలోచనలా కనిపిస్తోంది.

ఓట్లు రాబట్టడం కంటే సినిమా స్టార్లను తమ పార్టీలో పెట్టుకోవడంపైనే బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఏదో చేసేస్తాను.. ప్రశ్నించేస్తాను.. కడిగిపారేస్తానని.. ఊగిపోయిన పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు బీజేపీకి జీ హుజూర్ అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ సినిమా స్టార్లు, స్పోర్ట్స్ పర్సన్స్ బీజేపీ కండువాలు కప్పేసుకుంటున్నారు.

అయితే.. విజయశాంతి వెంట ఇప్పుడు బీజేపీ పడటానికి కారణం అయితే ఒకటుంది. ఏంటంటే.. విజయశాంతి పొలిటికల్ కెరీర్ ప్రారంభమయ్యిందే బీజేపీలో. సో.. ఇప్పుడు బీజేపీ చేస్తున్నది ఘర్ వాపసీ అన్నమాట.

- షాకింగ్ వీడియో : నడిరోడ్డుపై యువతి దారుణ హత్య

- సంజయ్ అంటే పోలీసులకు ఎందుకు పడటం లేదు..?

Next Story
Share it