Top
Batukamma

మన యాస, భాషలో లగ్గం కారట.. ఎట్లున్నదో సూడుర్రి!

మన యాస, భాషలో లగ్గం కారట.. ఎట్లున్నదో సూడుర్రి!
X
Highlights

అన్న , లగ్గం పత్రిక మస్తుగున్నదే ., మన తెలంగాణ యాస ,బాషాలో , ఇప్పటి దాక ఇట్లాంటి లగ్గం పత్రిక సుడలేదు .. ఈడి కాడి నుంచి అందరూ ఇట్లే రాయాలి

యుట్యూబ్ లో 'మై విలేజ్ షో' ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ ఫేం గంగవ్వతో కలిసి రాజు, చందులు చేసే ఈ వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అంతే ఇంట్రెస్టింగ్ గా తన పెండ్లి పత్రికను తయారు చేయించిండు చంద్రమౌళి (చందు)..

అయితే, ఈ పెండ్లి పత్రికను చందు ట్విటర్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ శుభలేఖను చూసిన నెటిజన్లు చందను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

పలనా వారి పెండ్లి పిలుపు, ఆహ్వానించువారు, విందు, స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, కనిష్ఠ పుత్రుడు, గరిష్ఠ పుత్రిక, కల్యాణ వేదిక ఇసొంటివి ఏమీ లేవు అందులో... అంతా మన యాస.. మన భాషలోనే లగ్గం కారట చేయించుండు.


తెలంగాణ వాడుక భాషలోనే ''లగ్గం పిలుపు, పిలిశెటోళ్లు, బువ్వ, ఐతారం అంబటాల్లకు 11.37 గొట్టంగ, మా సిన్న పిల్లగాడు, తొలుసూరి బిడ్డ, లగ్గం యాడనో ఎర్కనా" అన్న పదాలతో లగ్గం కారట కొట్టించి తెలంగాణ భాష మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

ఈ లగ్గం కారట చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. లగ్గం కారట మస్తుగుంది తమ్మి.. ఈ పెళ్ళిపిలుపు ఆకును కూర్చినవారికి దండాలు. చాలా ముచ్చట వేస్తుంది. ఈ పెళ్లి పిలుపును చూస్తే. తాము మాట్లాడుకొనే అమ్మనుడిలోనే ఈ పెళ్ళిపిలుపును చేయించి వాళ్ళ నేస్తాలకు చుట్టాలకు పంపుకున్నట్టున్నారు. ఇది చాలా ఆత్మగౌరవాన్ని తెలిపే పని. ఎవరి యాస ఏదో ఆ యాస గొప్పది.


అన్న , లగ్గం పత్రిక మస్తుగున్నదే ., మన తెలంగాణ యాస ,బాషాలో , ఇప్పటి దాక ఇట్లాంటి లగ్గం పత్రిక సుడలేదు .. ఈడి కాడి నుంచి అందరూ ఇట్లే రాయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story
Share it