Top
Batukamma

మంత్రి రాసలీలల డ్రామా అందుకోసమేనా..?

మంత్రి రాసలీలల డ్రామా అందుకోసమేనా..?
X
Highlights

అసలు ఈ రాసలీల వ్యవహారం ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చిందనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.

తెలంగాణ మంత్రి రాసలీలల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ మంత్రి ఎవరనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే.. ఇదే సమయంలో మరో ఇష్యూ కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

అసలు ఈ రాసలీల వ్యవహారం ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చిందనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. నిజంగానే సదరు మంత్రికి ముందు నుంచి ఇలాంటి అలావాటు ఉంటే పార్టీ పెద్దలకు కాస్తో కూస్తో లీకులు ఉండే ఉంటాయి. దీనిపై గతంలోనే అతడిని హెచ్చరించి ఉండొచ్చు.

కానీ సడెన్ గా ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు తెరపైకి వచ్చింది. అది కూడా వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు బయటకు రావడం అంటే మామూలు విషయం కాదు. మంత్రితో ఆయన దగ్గరి వ్యక్తి చేసిన చాట్ బయటకు రావడం పెద్ద ఇష్యూనే.

అయితే.. ఆ స్క్రీన్ షాట్ లు బయటపెట్టింది కూడా మంత్రికి.. సదరు మహిళకి మధ్య ఉన్న మరో మహిళ అని ప్రచారం జరుగుతోంది. అయితే.. ముందు నుంచి బాగానే ఉన్న మధ్యవర్తి అయిన మహిళ ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయించింది.

మంత్రిగారి రాసలీలల వ్యవహారాన్ని ఎందుకు సోషల్ మీడియాలో పెట్టింది.?? పార్టీ పెద్దలకు ఎందుకు షేర్ చేసింది.?

సదరు మధ్యవర్తి మహిళ ఏదైనా ఆశించి చేసిందా..? లేక ఎవరైనా.. ఏదైనా ఆశచూపి చేయించారా..? అనేదే ఇప్పుడు హాట్ ఇష్యూ అయ్యింది.

అయితే.. ఈ ఇష్యూలో ఇప్పుడు అన్నీ వేళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత వైపే చూపిస్తున్నాయి. ఇటీవలే కవిత ఎమ్మెల్సీ అయ్యారు. నిన్ననే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. కవితను కేబినెట్ లోకి తీసుకుంటారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ అయ్యారు. ఇక మిగిలిందల్లా కేబినెట్ లో బెర్త్. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేబినెట్ లోకి కవితను తీసుకోవడం సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే చట్టప్రకారం తెలంగాణ కేబినెట్ లో ఉండాల్సినంత మంది ఉన్నారు. మరొకరిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకునే పరిస్థితి లేదు.

ఎవరైనా కొత్తగా కేబినెట్ లోకి రావాలంటే ఇంకెవరైనా బయటకు వెళ్లాల్సిందే. అందుకే ఇప్పుడు ఓ మంత్రిని టార్గెట్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా కాలంగా నిఘా పెట్టి.. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి అతడిని కేబినెట్ నుంచి తప్పించాలని ప్లాన్ చేశారనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.

సదరు మంత్రి ఎవరనేది పూర్తిస్థాయిలో క్లారిటీ రాకున్నా.. ఆయన పదవి పోవడం మాత్రం ఖాయం అంటున్నారు. కొద్ది రోజుల పాటు ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచి.. ఈ గొడవ కాస్త.. సద్దుమణిగాక.. కవితను ఆ సీట్లో కూర్చోబెట్టే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే ఈ డ్రామా మొదలెట్టారని టాక్.

టీఆర్ఎస్ పార్టీ అనుకూల ఛానల్ లో మంత్రికి వ్యతిరేకంగా కథనాలు రావడం కూడా అందులో భాగమేననే ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it