Top
Batukamma

ఓయో రూముల్లో ఏం జరుగుతోంది...?

ఓయో రూముల్లో ఏం జరుగుతోంది...?
X
Highlights

-కొరవడిన పర్యవేక్షణ - ఏకాంత సేవలకు కేరాఫ్..! - కూకట్ పల్లి ఘటనతో మరోసారి వెలుగులోకి

ఓయో. ఓ స్టార్టప్ కంపెనీ. ఓ యాప్ ద్వారా మార్కెట్ లోకి వచ్చి.. హాస్పిటాలిటీలో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. తక్కువ పెట్టుబడితో మొదలైన ఓయో... ఇప్పుడు కోట్లాది రూపాయల బిజినెస్ చేస్తోంది. ఇప్పుడు ఏ చిన్న పట్టణంలో చూసినా మనకు ఓయో రూములు కనిపిస్తుంటాయి.

హోటల్ గది కావాలనుకున్న కస్టమర్ కి.. హోటల్ కి మధ్య వారధిలా ఓయో పనిచేస్తుంది. దీంతో ఇది చాలా సక్సెస్ అయ్యింది. మొబైల్ యాప్ ద్వారా రూం బుక్ చేసుకుని.. మొబైల్ నుంచే పేమెంట్స్ కూడా చేయొచ్చు. అందులో డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఇస్తుంది ఆ సంస్థ. దీంతో చాలామంది వీటిపై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు.

అయితే.. ఓయో(oyo) రూముల్లో ఏం జరుగుతోందనేది ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్న. కూకట్ పల్లిలో కొందరు యువకులు తమ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయిని ఓయో రూంకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఇప్పుడు ఓయో రూముల అడ్డగోలు బాగోతం మరోసారి బయటపడింది.

మామూలుగా అయితే ఏదైనా లాడ్జ్ కి గానీ, హోటల్ కి గానీ వెళితే అక్కడ కస్టమర్ డీటేల్స్, ఐడీ ప్రూఫ్, ఎంతమంది ఉన్నారు.? అమ్మాయిలున్నారా..? ఉంటే వారి రిలేషన్ ఏంటీ.? వంటి పర్సనల్ డీటేల్స్ తీసుకున్నాకే రూం అలాట్ చేస్తారు.

కానీ ఓయో రూముల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఫోన్లోంచి రూం బుక్ చేసుకోవడం.. తర్వాత రూంకి వెళ్లిపోవడం. దీంతో ఎంతమంది అందులో ఉంటున్నారు..? వాళ్లు ఏం చేస్తున్నారనే వాటిపై నిఘా ఉండటం లేదు. దీనికి తోడు మామూలు లాడ్జ్ లలో కాకుండా అపార్ట్ మెంట్లలోనూ ఓయో సంస్థ కొన్న ఫ్లాట్ లను తీసుకుని.. ఓయో రూములుగా నడిపిస్తోంది. దీంతో వాటిని మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకం వ్యక్తులు ఉండటం లేదనే మాట కూడా వినిపిస్తోంది.

దీంతో ఓయో రూములు కేరాఫ్ అసాంఘీక కార్యక్రమాలుగా మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, అమ్మాయిలు ఏకాంతంగా కలుసుకోవడానికి ఇవి సెక్యూర్ ప్లేస్ లు అనే ప్రచారం కూడా ఉంది. లాక్ డౌన్ టైంలో వీటిపై చాలా జోకులు కూడా చక్కర్లు కొట్టాయి. "ఓయో రూములు మూతపడ్డాయి.. పాపం ఇప్పుడు లవర్స్ ఎక్కడ కలుసుకుంటున్నారోనని.. " సోషల్ మీడియాలో మీమ్స్ హల్చల్ చేశాయి.

అంతేకాదు.. గతంలో కూడా చాలా సార్లు ఓయో రూముల్లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు లెటెస్ట్ గా కూకట్ పల్లిలో ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇలాంటి ఘటనలు తరుచుగా వెలుగులోకి వస్తున్నా.. పోలీసులు ఓయో రూములు నడుస్తున్న తీరుపై ఎందుకు నిఘా పెట్టడం లేదు. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

TRENDING VIDEO :


Next Story
Share it