Top
Batukamma

KTRకు సీఎం పదవి నిజమేనా..? KCR ఎప్పుడు దిగిపోతున్నారు..?

KTRకు సీఎం పదవి నిజమేనా..? KCR ఎప్పుడు దిగిపోతున్నారు..?
X
Highlights

అందుకే ఆయన ప్రగతిభవన్ కంటే ఎక్కువగా ఫాం హౌస్ లో ఉంటున్నారనే ప్రచారమూ లేకపోలేదు.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. త్వరలోనే కేటీఆర్(ktr) ముఖ్యమంత్రి(cm) కాబోతున్నారు. ఒకట్రెండు నెలల్లోనే కేటీఆర్ సీఎం కుర్చీలో కూర్చుంటారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో నిజమెంత..?

కేటీఆర్ కు సీఎం కుర్చీ ఇచ్చేందుకు కేసీఆర్(kcr) కుట్ర చేస్తున్నాడని అపోజిషన్ పార్టీల విమర్శలు.. కేటీఆర్ సీఎం ఖచ్చితంగా అవుతారంటూ అధికార పార్టీ నేతల స్టేట్ మెంట్లు. కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పజెబుతారని చాలాకాలంగా ప్రచారంలో ఉన్నా.. ఈ మధ్య కాలంలో అదీ మరీ ఎక్కువైంది. బీజేపీకి(bjp) అదే ప్రచారాస్త్రమైంది.

ఇటీవల సీఎం కేసీఆర్ కాస్త అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఈ ప్రచారం మరీ ఎక్కువైంది. ఖచ్చితంగా మంచి ముహూర్తం చూసి కేసీఆర్ సీఎం కుర్చీ దిగిపోతారనే ప్రచారమూ ఊపందుకుంది.

మరో ప్రచారమూ జరుగుతోంది. సీఎం ప్రత్యేక చొరవతో..యాదాద్రిని డెవలప్ చేయిస్తున్నారు. అయితే ఆ పనులు పూర్తయి ఆలయాన్ని ఓపెనింగ్ చేసే వరకు కేసీఆర్ పదవిలో ఉంటారని.. ఆ తర్వాత కేటీఆర్ కు బాధ్యతలు ఇస్తారనే జోరుగా వార్తలు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి.


దీనికి తగ్గట్టుగానే చాలా రోజులుగా కేటీఆర్ దూకుడు కూడా పెరిగింది. సీఎం చేయాల్సిన పనులు కూడా స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఏకంగా మంత్రుల(ministers)తో సమావేశాలు కూడా నిర్వహించారు.

జరుగుతున్న పరిణామాలన్నీ ఖచ్చితంగా కేటీఆరే సీఎం కాబోతున్నారనే మాట చెబుతున్నాయి. కానీ కేసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం.. ఈ ప్రచారం అంతా ఉత్తదే అనిపిస్తుంది.

ఎందుకంటే.. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు మామూలుగా ఉండవు. తెలంగాణ రాక ముందు.. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చారు. తానే ఆ పదవిలో కూర్చున్నారు. ఎందుకంటే ఆయనకు పదవి మీద ఆ స్థాయిలో యావ ఉందట. ఉద్యమం టైంలో ఆయనతో సన్నిహితంగా ట్రావెల్ అయిన వారిని ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు.

ఎన్నో ఏళ్లుగా కలలు కన్న పదవి అది. ముఖ్యమంత్రి అవ్వాలంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఆ పదవిలో ఉన్నారు. మరో మూడేళ్లు అదే పదవిలో కొనసాగే అవకాశముంది. అలాంటప్పుడు కేసీఆర్ ఎందుకు దిగిపోతారు..? సొంత కొడుక్కే కదా సీఎం పదవి ఇచ్చేది అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే.. ఈ విషయంలో కేసీఆర్ ఎవరినీ పెద్దగా పట్టించుకోరనేది ప్రచారంలో ఉన్న మాట. అయితే.. తన కుటుంబసభ్యులు మంచి పదవుల్లో ఉండాలనే ఆశ మాత్రం కేసీఆర్ కు ఉంది. అందుకే ఎంపీగా ఓడిపోయి ఖాళీగా ఉన్న కవిత(kavitha)ను ఎమ్మెల్సీ చేశారు. త్వరలో కేబినెట్ లోకి కూడా తీసుకోబోతున్నారట.

కొడుకు కేటీఆర్ ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ కు కొత్తగా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన సీఎం సీట్లో లేకున్నా ఆ స్థాయిలోనే పాలిటిక్స్ నడిపిస్తున్నారు. షాడో సీఎంగా చలామణి అవుతున్నారు.


దీనికి తోడు.. రాబోయే ఎన్నికలు టీఆర్ఎస్ కు చాలా టఫ్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ను సీఎం సీట్లో కూర్చోబెడితే టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవు. రాష్ట్రానికి నిధుల విషయంలో గానీ.. పొలిటికల్ గా గానీ.. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయగలిగే శక్తి కేటీఆర్ కు ఉందా..? అనేది మరో ప్రశ్న. కేసీఆర్ ఇలా అన్నీ తెలిసీ తెలిసీ.. పార్టీని రిస్క్ లో పెడతారా..? తన అస్తిత్వాన్ని రిస్క్ లో పడేసుకుంటారా..? ఇప్పుడిదే ప్రధాన చర్చ.

మరోవైపు.. బతికి ఉన్నంతకాలం తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ కూడా గతంలో చెప్పారు. ఇప్పుడు అదే జరుగబోతోందా..? అనేది కూడా చూడాలి.

కేటీఆర్ కు సీఎం పదవి విషయంలో ఫ్యామిలీ నుంచి కేసీఆర్ కు ప్రెషర్ నుంచి మాట టీఆర్ఎస్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అందుకే ఆయన ప్రగతిభవన్ కంటే ఎక్కువగా ఫాం హౌస్ లో ఉంటున్నారనే ప్రచారమూ లేకపోలేదు.

ఫ్యామిలీ ప్రెషర్స్ కి కేసీఆర్ తలొగ్గుతారా.? పదవి అనుభవించింది ఇక చాలు అనుకుని కేటీఆర్ కు బాధ్యతలు ఇస్తారా..? లేకపోతే.. ఈ టర్మ్ పూర్తయ్యే వరకు తానే పదవిలో ఉండి.. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

- ట్రెడిషనల్ గా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన అనసూయ

- బుల్లితెరకి మరో అనసూయ దొరికేసింది!

Next Story
Share it