కట్నం వేధింపులకు గర్భిణి బలి

X
Highlights
హైదరాబాద్ జగద్గిరిగుట్టలో విషాదం జరిగింది. కట్నం వేధింపులకు గర్భిణి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన అందరిని కలచివేస్తోంది.
PV22 Oct 2020 9:13 AM GMT
హైదరాబాద్ జగద్గిరిగుట్టలో విషాదం జరిగింది. కట్నం వేధింపులకు గర్భిణి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన అందరిని కలచివేస్తోంది.
జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డి నగర్ కు చెందిన శ్రవణ్ కుమార్ కు 24 ఏళ్ల కృష్ణప్రియతో 6 నెలల క్రితం పెళ్లి జరిగింది. ఇద్దరు ఇష్టపడటంతో కుటుంబసభ్యులు వారికి పెళ్లి చేశారు.
కొన్నాళ్లకే కృష్ణప్రియ గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె 5 నెలల గర్భవతి. ఆ తర్వాత ఆమెకు కట్నం వేధింపులు మొదలయ్యాయని అమ్మాయి కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఇవాళ కృష్ణప్రియ అత్తగారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే అత్తింటివారే తమ కూతురిని చంపేశారని.. తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కృష్ణప్రియ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త శ్రవణ్‌కుమార్ అత్త మీనాను అదుపులోకి తీసుకున్నారు.
Next Story