Top
Batukamma

This is RGV Review : "పవర్ స్టార్" సినిమాపై అసలైన రివ్యూ..!

This is RGV Review : పవర్ స్టార్ సినిమాపై అసలైన రివ్యూ..!
X
Highlights

This is RGV Review : పవర్ స్టార్ సినిమాపై నిన్నటి దాకా ఓ రేంజ్ లో హైప్ లేపారు. అందులో మొత్తం పవర్ స్టార్ కు...

This is RGV Review : పవర్ స్టార్ సినిమాపై నిన్నటి దాకా ఓ రేంజ్ లో హైప్ లేపారు. అందులో మొత్తం పవర్ స్టార్ కు వ్యతిరేకంగా ఉంటుందన్న స్థాయిలో ట్రైలర్ కూడా వదిలాడు వర్మ. సినీ చరిత్రలో ఫస్ట్ టైం ట్రైలర్ ను కూడా అమ్ముకున్నాడు వర్మ.

అయితే.. సినిమా రిలీజ్ అయ్యి.. దాన్ని చూశాక.. వర్మను తిట్టని వారు లేరు. నాన్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అయితే పిచ్చిపిచ్చిగా తిట్టేస్తున్నారు. ఇవాళ ఉదయం దాకా రగిలిపోయిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు కూల్ అయిపోయారు.

పవర్ స్టార్ మూవీ చూసిన ఓ ప్రేక్షకుడు.. తన భావాలను వెల్లడిస్తూ ఆర్జీవీ అంటే రాంగోపాల్ వర్మ కాదు.. రాధాగోపాల్ వర్మకి ఓ బహిరంగ లేఖ రాశాడు.

Image

“ఆర్జీవీ (రాధా గోపాల్ వర్మ)కి బహిరంగ లేఖ

ఒరేయ్ వర్మా, నువ్వు పవన్ కళ్యాణ్ దృష్టిలో మంచివాడవడం కోసం 37 నిమిషాల పదమూడు సెకన్ల చెత్త తీసి దాన్ని మా మీదకి వదిలి 177 రూపాయల డబ్బు, టైం బొక్క పెట్టడం ఏంట్రా బాబూ. పవన్ కళ్యాణ్ మీద చెడుగా ఒక్క వాక్యం కూడా లేదు సినిమాలో. నన్ను నిరాశపరచింది ఇది కాదు.

ఎవడైనా వ్యాపారవేత్త తాను అమ్ముకునే వస్తువు యొక్క నాణ్యత , మన్నిక, longevity చూపించి అది నచ్చితేనే కొనుక్కోమంటాడు. Longevityకి వారంటే కూడా ఇస్తాడు. సినిమాలు కూడా థియేటర్ కాన్సెప్ట్ లో మొదటి ఆట నచ్చి రివ్యూలు బయటికి వచ్చి అవి నచ్చితేనే మిగిలిన ప్రేక్షకులు చూస్తారు. అక్కడ నష్టపోతే మొదటి ఆట ప్రేక్షకులు మాత్రమే నష్టపోతారు.

Personalised OTT లో ఏమీ తెలీకపోయినా కొంటున్నారంటే అది నీ మీద నమ్మకమే. 37 నిమిషాల 'దానికి' సినిమా అనే పేరొకటి పెట్టి దానికి 177 రూపాయల టిక్కెట్ ఒకటి. ఈ బోడి చెత్తని బ్లాక్ లో 250 రూపాయల టికెట్ పెట్టి కొనుక్కోవడం మళ్లీ.

బ్యాంకాక్ లో కూడా కిందకి వచ్చాక పూర్తి సంతృప్తి దొరికిందని customer చెప్పాకే డబ్బులు ఇప్పిస్తారట. వాళ్ళు నీ కంటే నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నారురా బాబూ. నేను వెళ్లలేదులే. మా మార్కాపురం స్నేహితులు చెప్పారు.

ఆ ముప్పై ఏడు నిమిషాల్లో చివర్లో నీ బోడి ఫిలాసఫీలు ఒకటి. ఆ మాత్రం ఫిలాసఫీల మీద ఆసక్తి ఉన్నవాళ్లు పుస్తకాలు చదువుకుంటారులే. ఆ సిద్ధాంతాల సారాంశం కూడా సంక్షిప్తంగా ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతుంది. నీ మొహం ఎటకారంగానో, వ్యంగంగానో, నవ్వుతూనో ఇంటర్వ్యూ లల్లో చూడచ్చు గానీ , ఈ 37 నిమిషాల లఘు చిత్రంలో చూడలేక చచ్చాంరా బాబూ. నిజాయితీగా చెప్పాలంటే నీ మెట్ల ఫిలాసఫీ ఒక్కటే నచ్చింది సినిమా మొత్తంలో.

ఇలాంటివి Netflix లో రెండు వందల రూపాయలకు చాలా దొరుకుతాయిరా బాబూ. నిన్ను నమ్మడం అనవసరం. నీలో సినిమాలు తీసే టాలెంట్ ఒక్కటే పోయిందనుకున్నా. నీతి నిజాయితీలు కూడా పోయాయి.

పైగా నువ్వు ఆ సినిమా కాని సినిమాలో integrity గురించి మాట్లాడ్డం మరీ విడ్డూరం. నీ కంటే నిన్న మొన్న సినిమా మీద, తమ మీద తమకి గౌరవంతో వచ్చి నిబద్ధతతో సినిమాలు తీసే కొత్తవాళ్ళు చాలా నయంరా బాబూ.

సినిమా అనే కళకి పట్టిన చీడపురుగువి నువ్వు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే నువ్వు చూసినన్ని గొప్ప సినిమాలు చూడకపోయినా నేను కూడా చాలా మంచి సినిమాలు చూశాను. సినిమా అనే కాన్సెప్ట్ మీద అభిప్రాయం ఏర్పరచుకొనే వాళ్ళు నీ ఈ సినిమాలు చూడడంతో మొదలుపెడితే వాళ్ళకి చాలా నీచమైన అభిప్రాయం ఏర్పడుతుంది. సినిమా అనేది నీతో మొదలవలేదు నువ్వు నాశనం చేయడానికి.

Ravikanth reddy M

Next Story
Share it