Top
Batukamma

రక్తాలు చిందించడం, పాలు పోయడం కాదు.. అభిమానం అంటే ఇది!

రక్తాలు చిందించడం, పాలు పోయడం కాదు.. అభిమానం అంటే ఇది!
X
Highlights

అభిమానులు అంటే అభిమాన నటుడు మార్గంలో నడవడం.. అదే అసలైన అభిమానం... అభిమాన నటుడు కోసం రక్తలు చిందించడం, ధియెటర్ల ...

అభిమానులు అంటే అభిమాన నటుడు మార్గంలో నడవడం.. అదే అసలైన అభిమానం... అభిమాన నటుడు కోసం రక్తలు చిందించడం, ధియెటర్ల వద్ద పాలాభిషేకాలు చేయడం కాదు.. తాజగా రజనీకాంత్ అభిమాని ఒకరు తన నిజాయితీని చాటుకున్నాడు..ఇంతకీ ఎం జరిగింది అంటే.. తిరునెల్వేలికి చెందిన ఒక ఆటో డ్రైవర్ .. పేరు మురుగన్ ,. ఇతను రజనీకాంత్ అభిమాని.. దీనితో అతని పేరుని ఏకంగా రజినీ మురుగన్ అని మార్చుకున్నాడు..

అయితే ఈ రజిని మురుగన్ ఆటోలో తాజాగా ఒక వ్యక్తి ప్రయాణం చేశాడు. అయితే ఆ ప్రయాణంలో సదరు వ్యక్తి రెండు లక్షల రూపాయలను ఆ ఆటోలో మార్చిపోయాడు. అదృష్టం కొద్ది డబ్బులు దొరికాయి కదా అని తీసుకోలేదు.. వాడుకోలేదు.. కష్టం విలువ తెలిసిన వ్యక్తి కావడంతో ఆ డబ్బులను సదరు వ్యక్తిని తిరిగి ఇచ్చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న తిరునెల్వేలి డిప్యూటీ కమిషనర్ శరవణన్ రజిని మురుగన్ మరియు అతని భార్యను ఆహ్వానించి వారి నిజాయితీకి ప్రోత్సాహక బహుమతిని అందజేశాడు. వాస్తవానికి కరోనావైరస్, లాక్ డౌన్ కారణంగా రజినీ మురుగన్ కుటుంబం చాలా పేదరికంలో ఉంది, మరియు అతని కుమారుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కానీ అతను డబ్బు అవసరం కదా అని ఉంచుకోలేదు. నాది కానిది తనకి ఎందుకు అనుకున్నాడు. ఎవరికైనా డబ్బు అవసరమే కదా అనుకున్నాడు. నిజాయతీని చాటుకున్నాడు. అతని నిజాయితీకి రజినీ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.. రజినీకి అసలైన అభిమానివని సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు. రీయల్లి గ్రేట్ బాస్.. ఇంకా సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం!

Next Story
Share it