Subscribe

Andhrapradesh, News

తిరుమలలో లడ్డులు ఇక అగ్వకే!

TTD, Tirumala

తిరుమల శ్రీవారి భక్తులకి టీటీడీ మరో శుభవార్తను అందజేసింది. తిరుమలలో  విక్రయిస్తున్న పెద్ద, చిన్న లడ్డుల ధరలను సగానికి తగ్గిచేసింది. ఇంతకుముందు పెద్ద లడ్డు ధర రూ. 200కి అమ్ముతుండగా ఇప్పుడు రూ. 100 కే లభించనుంది. ఇక చిన్న లడ్డు ధర రూ. 25 రూపాయలకే లభించనుంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

TTD Laddu: Now, you can buy Tirupati laddus at Rs 25 per piece ...

ఇక లాక్ డౌన్ నేపధ్యంలో భక్తులు ఎవరని కూడా ఆలయంలోకి అనుమతించడం లేదు. అయినప్పటికీ శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం తగ్గలేదు. రెండు నెల్లలో రూ.1.98 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అధిక మొత్తం ఆన్‌లైన్ ద్వారానే వచ్చిందని చెప్పారు. ఇ-హుండీ ఆదాయం రూ.1.79 కోట్లు వచ్చిందని ఆయన వెల్లడించారు.

తిరుమలలో శ్రీవారి ఆలయంలో భక్తులని అనుమతించడం పైన ఇంకా సందిగ్ధత నెలకొంది. లాక్ డౌన్ సడలింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం  భక్తుల  దర్శనాలకి అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read : బళ్లాలదేవుడి ఎంగేజ్ మెంట్ జరగలేదట.. మరీ ఈ ఫొటోలు..?

(Visited 7 times, 1 visits today)