ADHIRINDI SHOW : నాగబాబు,శ్రీముఖికి శ్రద్ధాంజలి..! ఇంతకీ ఏంజరిగింది..?

వీళ్లకు శ్రద్దాంజలి ఏంటీ..? అనుకుంటున్నారా..? శ్రద్దాంజలి మాత్రమే కాదండోయ్. ఏకంగా బ్రోతల్ హౌస్ పెట్టారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి.
TROLLS ON NAGABABU AND SREEMUKHI OVER ADHIRINDI SHOW : నాగబాబు, శ్రీముఖికి ఏమైంది.? వీళ్లకు శ్రద్దాంజలి ఏంటీ..? అనుకుంటున్నారా..? శ్రద్దాంజలి మాత్రమే కాదండోయ్. ఏకంగా బ్రోతల్ హౌస్ పెట్టారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. నోటికొచ్చిన బూతులన్నీ తిట్టి మరీ వార్నింగ్ ఇస్తున్నారు.
ఇంతకీ ఏమైందంటే..
జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షో(ADHIRINDI SHOW).. ఇప్పుడు కాంట్రవర్సీ అయ్యింది. బొమ్మ అదిరింది పేరుతో వచ్చిన ఈ ప్రోగ్రాంలోని ఓ స్కిట్ ఈ కాంట్రవర్సీకి కారణం అయ్యింది. అందులో ఓ వ్యక్తి వైఎస్ జగన్ హావభావాలతో స్కిట్ చేస్తాడు. ఫేమస్ డైలాగ్ అయిన.. అన్నొస్తున్నాడని చెప్పండి... అంటూ దాన్నికూడా కామెడీకి వాడుకున్నారు.
[embed]https://www.facebook.com/100044729850069/videos/pcb.189843719183289/189843659183295/[/embed]
తమ అభిమాన నాయకుడిని.. అంతలేసి మాటలని.. కామెడీ చేస్తే జగన్ అభిమానులు ఊరుకుంటారా..? అసలే సోషల్ మీడియాలో జగన్ కు బలమైన సైన్యం ఉంది. దీనికి తోడు.. ఆ షోకి జడ్జ్ గా ఉన్నది నాగబాబు. ఇంకేముంది... అయిపాయే..
సోషల్ మీడియాలో నాగబాబు, శ్రీముఖి, జానీ మాస్టర్, స్కిట్ చేసిన వ్యక్తిని, జీ టీవీ మేనేజ్ మెంట్ ను తుక్కురేగగొడుతున్నారు.
బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. అంతవరకు పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు.
గతంలో ఇలా ముఖ్యమంత్రులపై కామెడీలు చేసిన వాళ్ల పరిస్థితి ఏమయ్యిందో అందరికి తెలిసిందే. టీవీ9లో బుల్లెట్ న్యూస్ పేరుతో వచ్చిన ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో... చాలా రోజుల పాటు ఛానల్ మూసేసుకోవాల్సి వచ్చింది.
జబర్ధస్త్ లో కూడా ఇలాంటి నోటి దూల యవ్వారాలు నడిచాయి. వాటికి బహిరంగంగా షో లో క్షమాపణ చెప్పారు. అయినా.. జీ తెలుగు ఇవేవీ పట్టించుకోకుండా.. వైరల్ కావాలని, షో కి వ్యూయర్స్ పెరగాలని ఇలాంటివి చేయడం ఎంతవరకు సరైందో ఆలోచించుకుంటే మంచిది.
READ ALSO :
- ఈ నెల 15 నుంచి స్కూళ్లు.. గైడ్ లైన్స్ ఇవే!
- ఖమ్మంలో మరో హత్రాస్ ఘటన!
- White House : ట్రంప్ చచ్చి.. బతికాడు.. మామూలుగా ఉండదు మరి..!
- ‘ఐరన్ లెగ్ శాస్త్రి’… ఇదే పేరు జీవితాన్ని నాశనం చేసింది!
- Leaders illegal affairs : ఇల్లీగల్ బాగోతాలు.. బండి సంజయ్ కి కొత్త తలనొప్పులు..!
TRENDING VIDEO :
[embed]https://www.youtube.com/watch?v=FevaUEzI0y4&t=2s[/embed]
- Adhirindhi comedy show anchor Adhirindhi comedy show cast Adhirindhi Gully boy Adhirindhi Telugu ADHIRINDI SHOW Adirindi latest episode 2020 Adirindi show timings anchor sreemukhi CONTROVERSY OVER ADHIRINDHI SHOW MUKHISREE NAGABABU sreemukhi trolls on nagababu TROLLS ON NAGABABU AND SREEMUKHI OVER ADHIRINDI SHOW Ys jagan followers attack on nagababu and sreemukhi YS Jagan Mohan Reddy అదిరింది అదిరింది షో నాగబాబు శ్రీముఖి