Top
Batukamma

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్!

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్!
X
Highlights

కరోనా వైరస్ ఎవర్ని వదలడం లేదు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరికి సోకి అందరినీ భయబ్రాంతులకు...

కరోనా వైరస్ ఎవర్ని వదలడం లేదు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరికి సోకి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంది.. ఇక తెలంగాణలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు.

తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌కు కూడా కరోనా సోకింది. ఆయనతో పాటుగా అయన భార్య, కుమారుడి కూడా కరోనా సోకినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం వారు ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

ఇక టీఆర్ఎస్ లో ఇప్పటికే హోం శాఖ మంత్రి మహ్మద్ అలీ, హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.. అటు కాంగ్రెస్ నుంచి వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడ్డారు.

Next Story
Share it