Top
Batukamma

Unlock 3.0 In Telangana : తెలంగాణలో లాక్ డౌన్ కొత్త రూల్స్ ఇవే..!

Unlock 3.0 In Telangana : తెలంగాణలో లాక్ డౌన్ కొత్త రూల్స్ ఇవే..!
X
Highlights

అన్ లాక్ 3.0 నిబంధనల్ని ఇటీవలే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కంటైన్ మెంట్ జోన్లలో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్...

అన్ లాక్ 3.0 నిబంధనల్ని ఇటీవలే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కంటైన్ మెంట్ జోన్లలో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ఉంటుందని చెప్పింది. దీంతో కేంద్ర నిర్ణయం ప్రకారమే రాష్ట్రంలో కూడా కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగిస్తామని సర్కారు చెప్పింది.

కంటైన్ మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ నెలాఖరు వరకు అన్ని చోట్లా... స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్ల వంటి విద్యా సంస్థలన్నీ మూసే ఉండనున్నాయి. మెట్రో రైళ్లు కూడా నడిచే అవకాశం లేదు.

Image

కంటైన్ మెట్ జోన్లలో సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, థియేటర్లు, బార్ లు, ఆడిటోరియాలు మూసే ఉంచాలి. కంటైన్ మెంట్ జోన్ల బయట మాత్రం కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 5 నుంచి ఇవి ఓపెన్ అవుతాయి.

కంటైన్ మెంట్ జోన్లు కాని ప్రదేశాల్లో కూడా భారీగా జనం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి లేదు. రాజకీయ, స్పోర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్, ఎడ్యుకేషన్, కల్చరల్, మతపరమైన కార్యక్రమాలకు భారీగా జనం గుమిగూడితే ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం చర్యలుంటాయి.

రాత్రి వేళ కర్ఫ్యూను కూడా ఎత్తేశారు. ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ కంపల్సరీగా ఉండాల్సిందేనని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం.

Next Story
Share it