Top
Batukamma

US Woman : యోగా కోసం వస్తే రేప్ చేశాడు..!

US Woman : యోగా కోసం వస్తే రేప్ చేశాడు..!
X
Highlights

అమెరికాకు చెందిన 37 ఏళ్ళ మహిళలకు యోగా అంటే ఇష్టం. ఆ మహిళకు డ్రగ్స్ కూడా అలవాటుంది.

US Woman raped in Rishikesh : రిషికేష్ లో దారుణం జరిగింది. యోగా నేర్చుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు స్థానిక వ్యక్తి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు.

అమెరికాకు చెందిన 37 ఏళ్ళ మహిళలకు(US Woman ) యోగా అంటే ఇష్టం. దీంతో తెలిసిన వారి ద్వారా అమెరికా నుంచి రిషికేష్ వచ్చింది. కొద్దిరోజులుగా అక్కడ యోగా నేర్చుకుంటోంది.

అయితే.. ఆ మహిళకు డ్రగ్స్ కూడా అలవాటుంది. రిషికేష్ లో డ్రగ్స్ వెతుకులాటలో ఆమెకు అభినవ్ రాయ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరి డ్రగ్స్ స్నేహం కాస్త శారీరక సంబంధాల వరకు వెళ్లింది. చాలా సార్లు అభినవ్ రాయ్ ఫ్లాట్ కు బాధిత మహిళ వచ్చివెళ్లిందని పోలీసులు చెబుతున్నారు.

ఈ నెల ఐదున ఫ్లాట్ బాల్కనీలో ఉన్న తనను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ముని కి రేతి స్టేషన్ లో కేసు ఫైల్ అయ్యింది.

..

READ ALSO :

Next Story
Share it