Top
Batukamma

కరోనా బాధితులను కాపాడటంలో కేసీఆర్ ఫెయిల్ !

కరోనా బాధితులను కాపాడటంలో కేసీఆర్ ఫెయిల్ !
X
Highlights

కరోనా వైరస్ ను అరికట్టడంలో అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. ...

కరోనా వైరస్ ను అరికట్టడంలో అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ పెడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు.

గత కొద్ది రోజులుగా హైదరాబాదులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కరోనా బాధితులను కాపాడటంలో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ప్రధానమైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లోని పరిణామాలే ఇందుకు సాక్ష్యం.

గాంధీ ఆస్పత్రిలో కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని దాదాపు రోజంతా మిగిలిన రోగుల మధ్యే ఉంచి వాళ్ళను భయభ్రాంతుల్ని చేశారు.

ఆక్సిజన్ లేక మరో కరోనా బాధితుడి ప్రాణం పోయింది. ఇక ఉస్మానియా ఆస్పత్రి మురికినీళ్ళ పాలై నరకాన్ని తలపించింది. ఇక నిమ్స్‌లోనూ ఏమంత ఆశాజనక పరిస్థితులు లేవు. మరోవైపు ఔట్‌సోర్సింగ్ నర్సులు, వార్డ్ బాయ్స్, 4వ తరగతి సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సమ్మె చేసే పరిస్థితి కల్పించారు.

ఈ సమ్మెను ఆపించడానికి ప్రభుత్వం రోజుల తరబడి సమయం తీసుకుంది. ఇదంతా చూస్తుంటే కరోనాను కట్టడి చెయ్యడంలో కేసీఆర్ దొరగారి సర్కారు గాడితప్పి పూర్తిగా చేతులెత్తేసినట్లు తేలిపోయింది. తెలంగాణ ప్రజలకు దేవుడే దిక్కు అన్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం మత్తు నిద్రపోతోంది.

Next Story
Share it