Subscribe

News, Telangana

ఆ ఇద్దరే అంతా చేశారా..?

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ వలసకూలీల మృతి కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన స్టైల్లో విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

బుధవారం రోజు మసూద్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఇందులో ఇద్దరు యువకుల నంబర్లకు కాల్స్ వెళ్లినట్టుగా కనిపించాయి. ఇవి కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

వారిని తమదైన స్టైల్లో ఇంటరాగేట్ చేసినపోలీసులు.. తర్వాత స్పాట్ కు కూడా తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన కీలక సమాచారం వరంగల్ పోలీసులకు అందినట్టు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో ఉన్న యువకులకు కేసుతో సంబంధం ఉందా..లేకపోతే ఏవైనా ఆధారాల కోసం మాత్రమే వీరిని ప్రశ్నిస్తున్నారా..అనేది తేలాల్సి ఉంది.

ఇప్పటికే డెడ్ బాడీల శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు పోలీసులు.  ఈ రిపోర్ట్ రావడానికి కనీసం రెండు వారాలైనా పడుతుంది. ఈ లోపల ఇతర ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు బీజీగా ఉన్నారు.

ఇకేసారి 9 మంది చనిపోవడంతో వరంగల్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. నిన్న రాత్రి పొద్దుపోయే వరకు అధికారులతో రివ్యూ చేస్తూనే ఉన్నారు సీపీ రవీందర్. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

(Visited 4 times, 1 visits today)