Top
Batukamma

జై మూవీ హీరోయిన్ కి ఈ నటుడికి ఏంటి సంబంధం?

జై మూవీ హీరోయిన్ కి ఈ నటుడికి ఏంటి సంబంధం?
X
Highlights

ఈమె తెలుగులో నవదీప్ హీరోగా వచ్చిన జై సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా ( శ్రీహరి ఇంట్లో పని మనిషి )గా నటించింది. బంగారం, ఒక్కడే

సినిమా... ఇదో రంగుల ప్రపంచం ఎప్పుడు ఎలా క్లిక్ అవుతామో ఎవరికి తెలియదు.. హీరో అవుదామని వెళ్తే విలన్ అవ్వొచ్చు.. డైరెక్టర్ అవుదామని వెళ్తే హీరో అవ్వొచ్చు.. వీటితో పాటుగా అదృష్టం కూడా ఉండాలి.. చాలా మంది ఆర్టిస్టుల్లో టాలెంట్ ఉన్న అదృష్టం లేక ఫెడౌట్ అయిపోయారు.. అందులో ఒకరు ప్రసాద్ బాబు..

ప్రసాద్ బాబు చిరంజీవితో కలిసి పునాది రాళ్ళు అనే సినిమాతో తన చిత్రరంగంలోకి ప్రవేశించాడు. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.. ఎక్కువగా చిరంజీవితోనే కలిసి నటించారు.. మన ఊరి పాండవులు, మొండిఘటం, హీరో, రుద్రవీణ, ఆపద్భాందవుడు లాంటి సినిమాలలో ఆయన నటించారు..

అంతులేని కథ సినిమాలో కమల హాసన్, రజనీకాంత్, జయప్రదలతో కలిసి నటించాడు. ఇక సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి బొబ్బిలి పులి, మేజర్ చంద్రకాంత్ సినిమాలలో నటించాడు. మొత్తం తెలుగు, తమిళ సినిమాలలో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించాడు. సుమారు 700 కి పైగా సినిమాలలో నటించారు ఆయన..

బుల్లితెర పై కూడా తనదైన ముద్ర వేశారు ఆయన.. చాలా సీరియల్స్ లో ఆయన కీ రోల్ పోషించారు.. ప్రస్తుతం వయసు దృష్ట్యా ఆయన ఎక్కువగా నటించడం లేదు.. అయితే ప్రసాద్ బాబు కొడుకు, కోడలు కూడా ఇండస్ట్రీ లొనే ఉన్నారు.. ఆయన కొడుకు శ్రీకర్ తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించారు.. కానీ అంతగా గుర్తింపు రాలేదు..

Image may contain: 2 people

ఇక సంతోషి శ్రీకర్ భార్య, ప్రసాద్ బాబు కోడలు.. ఈమె తెలుగులో నవదీప్ హీరోగా వచ్చిన జై సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా ( శ్రీహరి ఇంట్లో పని మనిషి )గా నటించింది. బంగారం, ఒక్కడే మొదలగు సినిమాల్లో నటించింది.. ఇక తమిళ్, కన్నడ భాషల్లో హీరోయిన్ గా నటించింది. అక్కడ పలు సీరియళ్లలో నటించి ఆకట్టుకుంది. కొన్ని సీరియళ్లలో సంతోషి, శ్రీకర్ నటించడంతో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఓ బాబు ఉన్నాడు.

Next Story
Share it