Top
Batukamma

అంటరాని మనుషులు.. అత్యాచారానికైతే కావాలా..? యోగీజి ఏంటీ దారుణాలు?

అంటరాని మనుషులు.. అత్యాచారానికైతే కావాలా..? యోగీజి ఏంటీ దారుణాలు?
X
Highlights

సాధారణంగా ఒక మనిషి అంగీకారం లేకుండా బలవంతంగా అనుభవించాలనుకోవడమే నీచాతి నీచం.. అటువంటిది వారిని బలాత్కరించే...

సాధారణంగా ఒక మనిషి అంగీకారం లేకుండా బలవంతంగా అనుభవించాలనుకోవడమే నీచాతి నీచం.. అటువంటిది వారిని బలాత్కరించే సమయంలో సాటి మనిషి అని మరచిపోయి క్రూరాతి క్రూరంగా శారీరక హింస పెడుతూ ఆటవికంగా హింసించి బలాత్కరించే వారిని జంతువులతో పోల్చుదాం అంటే అలాంటి పనులు జంతువులు చేయవు.. రాక్షసులతో పోల్చుదామంటే అలాంటి వారు కూడా లేరు.. ఎవరితో పోల్చాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇలాంటి నీచులని.. బహుశా ప్రపంచంలో ఇంతకన్నా కిరాతకులు ఉండరేమో.. అందుకే పోల్చడానికి కూడా ఎవరు దొరకట్లేదు..

మనీషా వాల్మీకి... రోజు సోషల్ మీడియా లో అందరూ భజన చేసే యోగి ముఖ్యమంత్రి గా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో హతరస్ జిల్లాలో రోజూ లాగానే ఆవులను గడ్డి కోసుకుందాం అని వెళ్లిన 19 ఏళ్ల అమ్మాయిని సెప్టెంబర్ 14 న నలుగురు వొళ్ళు కొవ్వెక్కిన కామాంధులు తీసుకెళ్లి నాలుక కోసేసి వెన్నుముక్క విరిచేసి, మెడ విరిచి హింసించి హింసించి రేప్ చేసి పడేసారు... ఆ రోజు నుండి 29 సెప్టెంబర్ వరకు ఎలాగైనా బ్రతకాలి అని పోరాడి పోరాడి తుది శ్వాస విడిచింది ఆ చెల్లి..

Lockdown ముందు నుండి ఉత్తర ప్రదేశ్ లో రేపు ల సంఖ్య ఘోరంగా పెరిగిపోయింది.. రోజు కనీసం 3 లేక 4 క్రూరమైన మానభంగం నేరాలు గురించి జాతీయ మీడియా ( బూట్లు నాకని మీడియా మాత్రమే) లో వస్తూనే ఉన్నాయి..

2018 National Crime Bureau Data ప్రకారం ఉత్తర ప్రదేశ్ లో ప్రతి రేండు గంటలకి ఒకరు బలాత్కారనికి గురి అవుతున్నారు.. ప్రతి గంటన్నరకి ఒక చిన్న పిల్ల లైంగిక వేధింపులకు గురి అవుతుంది.. .. ఇంకా అలాంటి data తయారు చెయ్యలేదు.. పైగా పనులు లేవు.. మొత్తం దక్షిణ భారత దేశం అంత జనాభా... చదువు ఉండదు.. మత పిచ్చి రాష్ట్రం.. మతాన్ని వాడుకుని రాజకీయ నాయకులు అభివృద్ధి చెయ్యకుండా ప్రజలను ఇంకా ఇంకా నిరక్షరాసులు గా నిరుద్యోగులుగా మార్చి రోజు రోజుకి దిగజారుస్తున్నారు.. ఇది 2020, పైగా కరోనా లాక్ డౌన్.. ఇప్పుడు పరిస్థితి ఏంటో కూడా తెలియదు..

గమనించాల్సిన విషయం మరొకటి ఉంది.. అత్యాచారాలకు గురి అయ్యేవారిలో ఎక్కువ శాతం దళితులే... నేరస్తులేమో అగ్ర కులానికి చెందిన వారే.. యోగి వచ్చాకా కుల దూరహంకార నేరాలు ఆ రాష్ట్రం లో ఎలా పెరిగాయో అందరికి తెలిసిందే.. సాధారణ ప్రజలు తుపాకులు కలిగి ఉండడం సర్వ సాధారణం అక్కడ.. చదువుకున్న కొంత మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటారు..

చదువు లేక బుద్ది కరువయ్యి మనుషుల్లా బ్రతకడం మానేశారు..

Neelima Yadav Jitta

Next Story
Share it