Top
Batukamma

White House : ట్రంప్ చచ్చి.. బతికాడు.. మామూలుగా ఉండదు మరి..!

White House : ట్రంప్ చచ్చి.. బతికాడు.. మామూలుగా ఉండదు మరి..!
X
Highlights

అవును.. నిజంగానే తెలుగు మీడియా దెబ్బకు అమెరికా అధ్యక్షభవనం, అందులోని అధికారులు జడుసుకున్నారు. దెబ్బకు దిగొచ్చారు. ఎందుకంటారా..?

White House released Trump video : అవును.. నిజంగానే తెలుగు మీడియా దెబ్బకు అమెరికా అధ్యక్షభవనం(White House), అందులోని అధికారులు జడుసుకున్నారు. దెబ్బకు దిగొచ్చారు. ఎందుకంటారా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, ఆయన భార్య మెలానియా ట్రంప్ కు ఇటీవలే కరోనా సోకింది. పెద్దగా సింప్టమ్స్ ఏమీ లేవని డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల తర్వాత ట్రంప్ ఆరోగ్యంలో మార్పులు రావడంతో బెతెస్థలోని మిలిటరీ హాస్పిటల్ లో చేర్పించారు.

ఇక.. హాస్పిటల్ లో చేర్చిన మరుసటి రోజు మొదలయ్యింది అసలు వ్యవహారం. శనివారం రోజు ట్రంప్ ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియో పెట్టారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని త్వరలోనే కోలుకుని బయటకు వస్తానని చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది.

కానీ.. దీనిపై మీడియా, మరీ ముఖ్యంగా తెలుగు మీడియా ఈకలు పీకడం మొదలు పెట్టింది. ట్రంప్ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మరో రెండు రోజులు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఒక టీవీ ఛానల్ ను చూసి.. మరో టీవీ ఛానల్.. చాలా ఛానళ్లు నిన్ననే ట్రంప్ ను చంపేసినంత పనిచేశాయి.

[embed]https://www.youtube.com/watch?v=5VoJEgMLcQs[/embed]

ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు ప్రతీ బులిటెన్ లో “ట్రంప్ ఆరోగ్యపరిస్థితి విషమించింది..” అంటూ బ్రేకింగులు.. ఫోన్ ఇన్ లతో గత్తరలేపారు. ఇక అంతా అయిపోయింది.. అన్నంత రేంజ్ లో సినిమా నడిపించారు.

[embed]https://youtu.be/5wWpI4JQ8ao[/embed]

ఒకవేళ ట్రంప్ ఈ ఛానల్స్ చూసి ఉంటే నిజంగానే చనిపోయి ఉండేవాడేమో..! కానీ చూడనట్టున్నాడు బతికిపోయాడు. కానీ వైట్ హౌస్ అధికారులకు తెలుగు మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి తెలిసినట్టుంది. అందుకే ట్రంప్ ట్విట్టర్ లో మరో వీడియో పోస్ట్ చేశారు. ఇందులో కూడా తాను బాగానే ఉన్నానని చెప్పాడు ట్రంప్.

[embed]https://twitter.com/realDonaldTrump/status/1312864232711520257?s=20[/embed]

అంతేకాదు.. హాస్పిటల్ బయట ఆయన కారులో వెళుతున్న ఓ వీడియో కూడా బయటకుక వచ్చింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న ప్రజలకు కారులోంచి అభివాదం చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

[embed]https://twitter.com/ANI/status/1312880347743358976[/embed]

Read Also :

Next Story
Share it