why jagan better than kcr : అన్నకు చుక్కలు చూపిస్తున్న తమ్ముడు జగన్..!

why jagan better than kcr : అవును.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. కేసీఆర్ కంటే ఆంధ్రప్రదేశ్...
why jagan better than kcr : అవును.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. కేసీఆర్ కంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూరు పాళ్లు నయమనే మాట వినబడుతోంది. మాట వినబడటం మాత్రేమే కాదు.. వాస్తవాలు కూడా అలాగే ఉన్నాయి.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అధికారులకు స్ట్రిక్ట్ ఆదేశాలిస్తున్నారు. ఎక్కడా తేడా రాకుండా పేషెంట్లకు వైద్య సేవలు అందాలని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు చాలా కీలకమైన ఆదేశాలిచ్చారు. “పేషంట్ కోవిడ్ కేర్ ఆస్పత్రికి వెళితే "బెడ్ లేదు" అనే మాట ఎట్టిపరిస్థితుల్లో రాకూడదు. ఎవరైనా పేషంట్ "నాకు బెడ్ దొరకలేదు" అంటే అది మన మానవత్వం మీద ప్రశ్నే అవుతుంది.”
ఇది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట.
[embed]https://www.youtube.com/watch?v=eLg4b1PWL7s&t=5s[/embed]
అయితే.. ఇదే తెలంగాణ విషయానికొస్తే.. పట్టించుకున్న నాథుడు లేకుండా పోయాడు. రివ్యూలు లేవు ఏమీ లేదు. టెస్టుల్లేవ్.. సౌకర్యాల్లేవ్.. ఆఖరికి చనిపోయిన వారి లెక్కలు తప్పుగానే చూపిస్తున్నారు.
పేషెంట్ వస్తే అరగంటలో బెడ్ ఇవ్వాల్సిందేనని.. లేకుంటే కలెక్టర్లు, ఎస్పీలతో బాధ్యతని ఏపీ సీఎం చెప్పారు. అదే తెలంగాణలో సర్కారు హాస్పిటల్స్ లో కనీసం లోనికి కూడా రానివ్వడం లేదు.
ఇక ప్రైవేటు హాస్పిటల్స్ లో బెడ్స్ ఉన్నాయని సర్కారు చెబుతోంటే.. బెడ్స్ ఖాళీగా లేవని హాస్పిటల్ మేనేజ్ మెంట్స్ చెబుతున్నాయి. రెండు మూడు రోజుల ట్రీట్మెంట్ కు 15 నుంచి 20 లక్షల వరకు గుంజుతున్నాయి.
వీటిపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. ఆఖరికి హైకోర్టు సీరియస్ అయినా.. తెలంగాణ సర్కారు పరిస్థితి దున్నపోతు మీద వానపడ్డట్టే ఉంది.
హాస్పిటల్స్ దగ్గర బాధితుల రోధనలు ఆకాశాన్నంటుతున్నాయి. అయినా సర్కారుకు కనికరం కలగడం లేదు. నాలుగు రోజులు క్యాంప్ ఆఫీస్ లో.. నెల రోజులు ఫాం హౌస్ లో ఉంటూ.. సీఎం మొద్దునిద్ర పోతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
వాస్తవానికి తెలంగాణ తర్వాత ఏపీలో కరోనా కేసులు మొదలయ్యాయి. అయినా చాలా తక్కువ టైంలో జగన్ చాలా వరకు సక్సెస్ సాధించారనే చెప్పాలి. మొదటి నుంచే ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నారు.
ఆంద్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 17 లక్షల 49 వేల 425 టెస్టులు చేస్తే.. తెలంగాణలో 3 లక్షల 97 వేల 939 టెస్టులు చేశామని కేసీఆర్ సర్కారు చెబుతోంది. అంతేకాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ ప్రకారమే టెస్టులు చేస్తున్నామని సమర్థించుకుంటోంది.
దీంతో కేసీఆర్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. టెస్టులు, ట్రీట్మెంట్ విషయంలో జగన్ దూకుడు చూసి కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అవుతోందని అంటున్నారు.