Top
Batukamma

Kathi Karthika In Dubbaka : కష్టమని తెలిసినా "కత్తికార్తీక" ఎందుకు దుబ్బాక వెళ్లింది..?

Kathi Karthika In Dubbaka : కష్టమని తెలిసినా కత్తికార్తీక ఎందుకు దుబ్బాక వెళ్లింది..?
X
Highlights

ఓ పార్టీ ఎమ్మెల్యే చనిపోవడంతో వచ్చిన బై ఎలక్షన్ లో ఇతర పార్టీల గెలుపు కష్టమే. అయినా కత్తి కార్తీక దుబ్బాక ఎందుకు వెళ్లింది..?

Why Kathi Karthika Contesting In Dubbaka : దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగబోతోంది. తేదీలు ప్రకటించకుండా.. ఆల్రెడీ అక్కడి లీడర్లు, ప్రజలు ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయారు. మరోసారి తామే గెలుస్తామని టీఆర్ఎస్.. ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నాయి.

అయితే.. టగ్ ఆఫ్ వార్ లోకి మాజీ యాంకర్, అర్కిటెక్ట్, కత్తి కార్తీక ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని రోజులు ఓ సెలబ్రిటీగానే ఉన్న కత్తి కార్తీక ఎందుకు దుబ్బాక బరిలోకి దిగారు. సాధారణంగా ఉప ఎన్నికలంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. దీనికి తోడు ఎమ్మెల్యే చనిపోవడంతో వచ్చిన బై ఎలక్షన్. కాబట్టి అక్కడ ఇతరపార్టీలు గెలవడం కాస్త కష్టమైన పనే.

కానీ ఇలాంటి టైంలోనే కత్తి కార్తీక దుబ్బాకలోకి ప్రవేశించింది. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇండిపెండెంట్ గానే పోటీచేస్తాను. ఒక వేళ వేరే పార్టీలేమైనా టికెట్ ఇస్తామన్నా తీసుకోనని.. తాను ఇండిపెండెంట్ గానే ఉంటానని కత్తి కార్తీక చెబుతోంది.

[embed]https://www.facebook.com/KathiKarthikaOfficial/posts/927799067715867[/embed]

కానీ ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నది మాత్రం మరోలా ఉంది. బీజేపీ నేత రఘునందన్ రావుకు చెక్ పెట్టేందుకే కత్తికార్తీకను బరిలోకి దింపారనే మాట వినిపిస్తోంది. రఘునందన్ రావు మంచి దూకుడుగా వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. బై పోల్ లో తానే గెలుస్తానని చెబుతున్నారు.

ఇదే దూకుడు కంటిన్యూ అయితే టీఆర్ఎస్ పార్టీకి కాస్త ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు చేయలేదు. అప్పుడే బీజేపీ నుంచి రఘునందన్ రావు ప్రచారం మొదలెట్టేశారు. దీంతో ఇప్పుడు ఓటు బ్యాంకును డైవర్ట్ చేయడమే అధికార పార్టీ మెయిన్ టార్గెట్. సామాజిక వర్గాల వారీగా ఓటు బ్యాంకు లెక్కలేసుకోవడం కామన్.

bjp raghunandan rao

కులాల లెక్కల కారణంగా ఇప్పుడు బీసీ ఓట్లు చాలా కీలకం. ఆ ఓట్లు రఘునందన్ రావుకు పడితే టీఆర్ఎస్ కు దెబ్బపడినట్టే. బీసీ ఓటర్లు ఏ మాత్రం మనసు మార్చుకున్నా.. సీఎం సొంత ఇలాకాలో పరువు పోవడం ఖాయం.

ఈ ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే బీసీ ఓట్లు చీలిపోవాలి.

కన్ఫ్యూజన్ లో ఉన్న బీసీ ఓటరు తమకు ఓటేయకపోయినా ఫర్వాలేదు గానీ.. బీజేపీకి మాత్రం వేయొద్దనే స్ట్రాటజీతో టీఆర్ఎస్ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కత్తి కార్తీకను బరిలోకి దించారనే మాట వినిపిస్తోంది. మాజీ మంత్రి డిప్యూటీ స్పీకర్ కత్తి పద్మారావుకు కార్తీక బంధువు కావడం కూడా ఈ ప్రచారానికి ఓ కారణం.

బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిక కార్తీకకు యాంకర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి పేరుంది. దీంతో ఆ ఫేమ్ ను వాడుకుని కొంత వరకు ఓట్లు చీల్చవచ్చని టీఆర్ఎస్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అయితే.. టీఆర్ఎస్ మరో ప్లాన్ కూడా వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు దుబ్బాక అభ్యర్థిని ప్రకటించలేదు టీఆర్ఎస్.

అయితే.. కార్తీక ఫేమ్ ఎలా ఉంది. ఎంత వరకు ఓటర్లను ఆకర్షించగలదు..? అని టెస్ట్ చేసేందుకే కొద్ది రోజులు ముందుగానే ఆమెను దుబ్బాక పంపించారనే మాట కూడా వినబడుతోంది. ఒకవేళ కార్తీక ఫాలోయింగ్ బాగానే ఉంటే.. టీఆర్ఎస్ టికెట్ ఆమెకు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నేతలు.

అయితే... ఈ ప్రచారంలో ఎంత వరకు వాస్తవముందనేది కాలమే నిర్ణయించాలి.

Read Also

Next Story
Share it