Wife Killed Husband : ఈ కిలాడీ.. కరోనాతోనే గేమ్స్ ఆడింది..!

ఇప్పుడు కరోనాను ఫుల్లుగా వాడేస్తున్నారు. కానీ చేసిన పాపం ఊరికే పోదుకదా.. పోలీసులకు దొరికిపోయింది
Wife Killed Husband With The Help Of Lover In Guntur : కాదేదీ కవితకు అనర్హం.. అని అప్పట్లో ఓ మహా కవి చెప్పాడు. అయితే.. ఇప్పుడు కాదేదీ అక్రమపనులకు అనర్హం అంటున్నారు క్రిమినల్స్. దోపిడీల నుంచి అక్రమ సంబంధాల వరకు .. ఇప్పుడు కరోనాను ఫుల్లుగా వాడేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో ఓ మహిళ ఇదే పని చేసింది. కరోనా పేరును అడ్డం పెట్టి.. మొగుడిని అడ్డు తప్పించి.. ప్రియుడితో కులుకుదామని చూసింది. కానీ చేసిన పాపం ఊరికే పోదుకదా.. పోలీసులకు దొరికిపోయింది.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన దుర్గా ప్రసన్న అనే వ్యక్తి సెంట్రింగ్ పని చేస్తాడు. అతను తన తమ్ముడు సీతారామంజనేయులు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య వ్యవహారంపై చాలాకాలంగా సీతారామాంజనేయులు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో తరుచూ తాగొచ్చి కొడుతుండేవాడు.
భర్త తరుచూ కొడుతుండటంతో.. ఆ మహిళ విసిగిపోయింది. భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా.. సంతోషంగా.. కులుకొచ్చని అనుకుంది. ఇంకేముంది తన ప్రియుడైన బావ దుర్గా ప్రసన్నతో కలిసి మర్డర్ కు ప్లాన్ వేసింది.
- Roti vs Rice : మీరు బరువు తగ్గాలంటే ఏమి తినాలి?
- Chicken VS Egg : చికెన్ VS గుడ్డు- ఏది ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉంటుంది?
గతనెల 21న సీతారామాంజనేయులను నవులూరు క్రికెట్ స్టేడియం వెనుక వైపు తీసుకెళ్లింది. ప్రియుడు దుర్గా ప్రసన్న, అతని స్నేహితులతో కలిసి సీతారామాంజనేయులకు ఊపిరాడకుండా చేసి చంపేసింది. దాన్ని ఆత్మహత్యకు చిత్రీకరించేందుకు ప్లాన్ వేసింది ఈ కిలాడీ లేడీ.
ప్రియుడు.. అతని స్నేహితుల సాయంతో భర్త డెడ్ బాడీని అక్కడే ఉన్న చెట్టుకు వేలాడదీసింది. తన భర్తకు కరోనా వచ్చిందని.. ఆ భయంతోనే ఉరివేసుకుని చనిపోయాడని పోలీసులను, బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. దీనికి పర్ ఫెక్ట్ గా ఆధారాలు సెట్ చేసింది. డెడ్ బాడీ దగ్గర కరోనాకు వాడే మందులు, మాస్కులు, గ్లౌజులు పడేసింది.
ఇక.. తన రూట్ క్లియర్ అయింది. ప్రియుడితో ఫుల్ ఫ్రీడమ్ అనుకుంది. కానీ పోలీసులు ఊరుకోరు కదా. అది ఆత్మహత్య కాదని వారికి అనుమానం వచ్చింది. దీంతో నిజంగానే అతనికి కరోనా ఉందా లేదా.? లేదా అని రికార్డులు చెక్ చేశారు. అతనికి కరోనా లేదని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.
మృతుడి బార్య లక్ష్మిని కాస్త గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటకు చెప్పేసింది. తాను, తన బావ, అతని స్నేహితులు కలిసి చంపేసినట్టు ఒప్పేసుకుంది. కరోనా పేరు చెప్పి మొగుడిని అడ్డుతప్పించుకోవాలని చూసి ఇఫ్పుడు జైళ్లోకి వెళ్లి ఊచలు లెక్కిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- Amazon : ఆర్డర్ చేస్తే 30 నిమిషాల్లోనే డెలివరీ.. అమెజాన్ అదుర్స్
- ప్రణబ్ ముఖర్జీ లేకుంటే సోనియా గాంధీ లేదు!
- ప్రణబ్ జీవితంలోని ఆసక్తికర విశేషాలు
- keerthy Suresh : కీర్తి సురేష్ బాగా తగ్గింది.. ఎందుకంటే..?
- ఆ ఒక్క మిస్టేక్ చెన్నకేశవరెడ్డి సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టలేకపోయింది!
- ఈ బస్ స్టాప్ మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా!
- ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేం నాగరాజు భార్యను చూసారా!